చెప్పులోని ముల్లు, చెవిలోని జోరిగ, ఇంటిలోని పోరు ఇంతింతగాదయా అన్నాడు మన వేమన ఏనాడో.. అంటే.. ఇవి మనతో పాటే ఉంటూ మనల్ని ఇబ్బంది పెట్టే బాధలన్నమాట. చెప్పులో ముల్లు అడుగువేసినప్పుడల్లా కుచ్చుకుంటూనే ఉంటుంది. చెవిలో జోరీగ చాలా చిరాకు పెడుతుంది... అదిలినా మళ్లీ వచ్చి గుయ్యిమంటూ తలనొప్పి తెచ్చిపెడుతుంది. ఇక ఇంట్లో పోరు అంటే అత్తాకోడళ్ల పోరు మహా తలనొప్పి. 

 

 

ఇప్పుడు సీఎం జగన్ పరిస్థితి అలాగే ఉంది. సరిగ్గా ఎన్నికల ముందు పార్టీలోకి తెచ్చిపెట్టుకున్న రామకృష్ణంరాజు ఇప్పుడు ఏకుమేకవుతున్నాడు. పార్టీ పరువు రోజురోజుకూ బజార్న పడేస్తున్నాడు. పోనీ అని వేటు వేద్దామంటే.. అది అంత సులభం కాదు.. ఇప్పుడు జగన్ కు రామకృష్ణరాజు చెవిలో జోరీగలా తయారయ్యాడు. ఇప్పటికే బహిరంగ వేదికలపై పదే పదే పార్టీనేతలను సవాల్ చేస్తున్న రామకృష్ణంరాజు తాజాగా మరోసారి జగన్ ను ఇరుకున పెట్టే పని చేశాడు.  

 

 

వృద్దాప్య పెన్షన్ పెంచాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. వృద్దాప్య పెన్షన్ వయో పరిమితి అర్హతను అరవై ఐదేళ్ల నుంచి అరవై ఏళ్లకు తగ్గిస్తామని గత ఏడాది జిఓ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కానీ ఏడు నెలల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే దాన్ని అమలు చేస్తున్నారని... దీనివల్ల అర్హులైన వృద్ధులు 15700 రూపాయలు నష్టపోయారని లెక్కలు కట్టి మరీ లేఖలు రాస్తున్నారు. అంతే కాదు.. వైఎస్ ఆర్ జయంతి సందర్భంగా ఈ ఏడాది పెన్షన్ ను 2500 రూపాయలకు పెంచాలని కోరారు.

 

 

రామకృష్ణరాజు అసమ్మతిని ప్రతిపక్ష తెలుగు దేశం అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు అతన్ని బాగా వాడుకుంటోంది. సొంత పార్టీ ఎంపీయే జగన్ సర్కారు పాలనను తప్పుబడుతున్నారంటూ కోట్ చేస్తోంది. అనుకూల మీడియాలో ఇంటర్వ్యూలు ఇప్పిస్తోంది. మొత్తానికి ఈ రామకృష్ణంరాజు తలనొప్పి నుంచి జగన్ కు ఎప్పుడు విముక్తి లభిస్తుందో..? 

మరింత సమాచారం తెలుసుకోండి: