టిడిపి అధినేత చంద్రబాబు లో రోజురోజుకు అసహనం పెరిగిపోతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ రావడం, వైసీపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే క్రమంలో తామే అబాసుపాలు అవుతుండడం వంటివి ఇప్పటికే అసహనాన్ని కలిగిస్తున్నాయి. ఈ సమయంలో పార్టీలో కీలక నాయకులు ఎవరు నోరు మెదపకుండా సైలెంట్ గా ఉండడం, పార్టీ నేతలు అరెస్ట్ అవుతున్నా, ప్రభుత్వ తీరును ఖండించకపోవడం, తమకు ఎందుకు వచ్చింది లే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండడం, ఇవన్నీ అసహనాన్ని కలిగిస్తున్నాయి. 
 
 
అలాగే చాలామంది నాయకులు నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండకుండా ప్రభుత్వం పై పోరాటం చేసేందుకు ముందుకు రాకపోవడం, పూర్తిగా అజ్ఞాతంలో ఉన్నట్టుగా వ్యవహరిస్తుండడం, అధికార పార్టీ వేధింపులకు టిడిపి కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్న నాయకులు ఎవరు పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తుండడం, ఇవన్నీ బాబుకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది ఈ సమయంలో ఏ ఏ నాయకులు పనితీరు ఎలా ఉంది అనే విషయం పై చంద్రబాబు నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. 
 
 
 
దాదాపు 100కు పైగా నియోజకవర్గాల్లో నాయకులు ఎవరు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి యాక్టివ్ గా లేరు అని, నియోజకవర్గాల్లో కార్యకర్తలు కూడా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ముందుకు వచ్చేందుకు జంకుతున్నారు అని ఇలా అనేక విషయాలు బాబుకు నివేదిక రూపంలో అందాయి. అలాగే పార్టీ హైకమాండ్ నుంచి సూచనలు ప్రభుత్వం పై పోరాటాలు చేయవలసిందిగా ఆదేశాలు వచ్చినా, పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తుండడం  ఈ పరిణామాలన్నీ ఇప్పుడు చంద్రబాబు పార్టీ కీలక నాయకులు దగ్గర ప్రస్తావించి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎన్నో రకాల సమస్యల్లో అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలుతున్న, వాటిని బయట పెట్టే అవకాశం ఉన్న ఒకరిద్దరు నాయకులు తప్ప మిగతా వారు ఎవరు మీడియా ముందుకు వచ్చి ఈ విషయాలను ప్రస్తావించేందుకు వెనకడుగు వేస్తూ, అధికార పార్టీకి భయపడుతూ ఉండటం వంటి పరిణామాలను చంద్రబాబుకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది కీలక నాయకులకు ఇదే విషయమై గట్టిగా క్లాస్ పీకిన ట్లు తెలుస్తోంది. ముందు ముందు  వ్యవహార శైలి ఇదే విధంగా ఉంటే వేటు తప్పదని వార్నింగ్ లు కూడా ఇచ్చినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: