నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామక్రిష్ణం రాజు ఇపుడు వైసీపీ కి రెబెల్ గా మారారు. ఆయన ఏడాదిగా కాస్తా సౌండ్ చేస్తున్నా కూడా షోకాజ్ నోటీస్ వ్యవహారం తరువాత ఫ్రీ బర్డ్ అయినట్లుగా కనిపిస్తున్నారు. ఆయన నేరుగా జగన్ కే లేఖలు రాస్తూ విపక్ష నేతలల్లో ముందు వరసరలోకి వచ్చేశారు. ఆయన జగన్ ఇచ్చిన హామీలను వరసగా  గుర్తు చేస్తూ వాటి  సమస్యలు తీర్చమంటున్నారు. ఇది బాగానే ఉన్నా తమను కాదని కదం తొక్కుతున్న రాజు గారు సూచనలు చేయడంతోనే వైసీపీకి మండిపోతోంది.

 

నిజానికి రాజు గారికి స్వర్గీయ  వైఎస్సార్ తోనే మంచి సంబంధాలు ఉండేవని చెబుతారు. వైఎస్సార్ కి ఆయన సన్నిహితంగా మెలిగేవారని అంటారు. ఆ టైంలో ఇపుడు వైసీపీలో ఉన్న నాయకులు అంతా పక్కా జూనియర్లు, పైగా రాజు గారికి వీరు ఎదురుగా నిలిచేవారు కాదని కూడా రాజు గారి అనుచరులు చెబుతున్నారు. సరే ఆ తరువాత జగన్ వైపు వచ్చిన రాజు గారు మళ్లీ ఆయన్ని వీడి బీజేపీ, టీడీపీల వైపు చేరారు. చివరికి వైసీపీ వైపు వచ్చి ఎంపీ అయినా కూడా ఆయన ఎందుకో జగన్ పార్టీకి దూరం అవుతున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే రాజు గారి మీద అనర్హత వేటు వేయాలని వైసీపీ లోక్ సభ స్పీకర్ కి పిటిషన్ ఇచ్చింది. ఇక స్పీకర్ కోర్టులో బంతి ఉంది. ఆయన ఎపుడు తేలుస్తారు అన్నది చూడాలి. ఈలోగా రాజు గారు మాత్రం బాగానే వైసీపీని తగులుకుంటున్నారు. ఆయన ఓ విధంగా వైసీపీకి కోరకరాని కొయ్యగా మారారని అంటున్నారు. వైసీపీ నేతలు అసహనంగా ఫీల్ అవుతున్నారు కూడా.

 

ఉంటే పార్టీలో ఉండాలి, నచ్చకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజుగారికి వార్నింగు ఇచ్చారు. దీని బట్టి చూస్తే వైసీపీలో అంతా ఇపుడు రాజుగారి మీద గుర్రుగా ఉన్నారని అంటున్నారు అయితే తన మీద అనర్హత వేటు పడదనే రాజుగారు డేరింగ్ గా ముందుకు వస్తున్నారని అంటున్నారు. ఆయన పార్టీ విప్ ని ధిక్కరించలేదు.

 

అలాగే పార్టీ కార్యక్రమాలకు దూరం కాలేదు. ఇక ఆయన పార్టీ కార్యక్రమాలను  లోపాలను విమర్శించారు. ఈ మాత్రం దానికి ఆయన మీద వేటు అనే పెద్ద ఆయుధం తీసి స్పీకర్ చర్యలు తీసుకోరు అని రాజ్యాంగ నిపుణులు కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే రాజు గారు మాత్రం వైస్పీకి పెను సవాల్ గా మారారు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: