గత కొన్ని రోజుల నుండి కేరళలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. నిన్న ఏకంగా రికార్డు స్థాయిలో 240 కేసులు నమోదయ్యాయి ఈరోజు కూడా కేసుల సంఖ్య 200 దాటింది దాంతో పరిస్థితి చేయిదాటిపోతుందేమోనని ముందే మేల్కొన్నకేరళ సర్కార్ కరోనా ప్రభావం అధికంగా వున్న రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో రేపటి నుండి వారం రోజులు ట్రిపుల్ లాక్ డౌన్ (కఠిన నిబంధనలతో) విధిస్తున్నామని సీఎం పినరయ్ విజయన్ ప్రకటించారు.
 
రేపు ఉదయం 6గంటల నుండి ఈలాక్ డౌన్ అమలులోకి రానుంది.  కేవలం మెడికల్ షాపులు ,నిత్యావసర వస్తువుల దుకాణాలు తప్ప మిగితావన్ని మూసివేసి ఉంటాయి అలాగే ప్రజా ,ప్రైవేట్ రవాణా కూడా స్థంభించిపోనుంది. ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 225పాజిటివ్ కేసులు బయటపడ్డాయి ఈకొత్త కేసులతో  కలిపి కేరళలో ఇప్పటివరకు 5429కేసులు నమోదు కాగా అందులో 3174మంది బాధితులు కోలుకున్నారు  ప్రస్తుతం 2229కేసులు యాక్టీవ్ గా ఉండగా 26మంది కరోనాతో చనిపోయారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
ఇదిలావుంటే మిగితా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈరోజు భారీగా కేసులు  నమోదయ్యాయి అందులో భాగంగా తమిళనాడులో కొత్తగా 4150కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 111151కు చేరింది అలాగే కర్ణాటకలో ఈరోజు రికార్డు స్థాయిలో 1925కేసులు నమోదయ్యాయి వీటితో కలిపి ఆరాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23474కు చేరింది.
 
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ లో కొత్తగా 1590కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 23902కు చేరింది అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు 998 కేసులు బయటపడగా మొత్తం ఇప్పటివరకు అక్కడ 18697కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ ఇప్పటివరకు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 696000దాటింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: