ఇటీవల అమరావతి రాజధాని రైతుల ఉద్యమం 200 రోజులు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో చాలామంది సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇతర దేశాలలో ఉన్న ఎన్నారైలు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న దీక్షకు భారీ ఎత్తున మద్దతు రావడం జరిగింది. అలాగే దేశంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు మేధావులు కూడా మద్దతు తెలిపారు. కాగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ముందునుండి రాజధాని రైతుల దీక్షకు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. దీంతో 200 రోజులు అమరావతి రాజధాని కోసం దీక్షలు చేసిన రైతులకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు.

 

ఈ సందర్భంగా మోడీ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. మోడీ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని కడతారని మాట ఇచ్చారని అందువల్లనే పార్లమెంట్ ఆవరణలో మట్టి, యమునా నది జలాలను తీసుకు వచ్చి ఆరోజు అండగా ఉంటామని చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అమరావతి రాజధానిని కాపాడాల్సిన బాధ్యత మోడీపై ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సేవ్‌ అమరావతి..సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ నినాదం కొనసాగించాలని అమరావతి రైతులకు పిలుపునిచ్చారు.

 

మొత్తం మీద తన కలల రాజధాని అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచడానికి అప్పట్లో జోలె పట్టిన చంద్రబాబు...ఇప్పుడు భారమంతా మోడీవైపు అన్నట్టుగా ఈ విషయంలో స్టీరింగ్ అటువైపు తిప్పడంతో కేంద్రం అమరావతి విషయంలో...ఏ విధంగా ముందుకు వెళ్తుందో అన్న చర్చ తాజాగా ఉత్పన్నమైంది. అప్పట్లో కేంద్రం అమరావతి రాజధాని ప్రాంతంలో సర్వే చేయగా...చాలావరకు ఈ ప్రాంతం రాజధానిగా పనికి రాదని కొన్ని నివేదికలు కేంద్రానికి వెళ్లటం అందరికి తెలిసిందే. ఇలాంటి తరుణంలో చంద్రబాబు అమరావతిని రాజధానిగా కాపాడాల్సిన బాధ్యత మోడీ సర్కార్ పై ఉన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: