తెలంగాణలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది.టెస్టుల సంఖ్య పెద్దగా లేకపోయినా పాజిటివ్ రేట్ మాత్రం ఎక్కువగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1590 పాజిటివ్ కేసులు రాగ కరోనాతో 7గురు మరణించారని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదయిన కేసుల్లో అత్యధికంగా జిహెచ్ఎంసి లో 1277,,మేడ్చల్ లో 125, రంగారెడ్డిలో 82కేసులు బయటపడ్డాయి.
 
ఇక సూర్యపేటలో కూడా ఈరోజు భారీగా కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 23మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 5965 శాంపిల్ టెస్టులు జరిగాయి. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 23902 కరోనా కేసులు నమోదవ్వగా అందులో 10195 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 9984కేసులు యాక్టీవ్ గా ఉండగా రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 283కి చేరింది.   
ఇక దేశ వ్యాప్తంగా ఈరోజు కూడా భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈఒక్క రోజే దేశంలో 24000కుపైగా కేసులు నమోదయ్యాయని సమాచారం. ఈకేసులతో కలిపి ఇప్పటివరకు ఇండియాలో 698000 కరోనా కేసులు నమోదుకాగా 19000కు పైగా కరోనా మరణాలు సంభవించాయి. కాగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో ఇండియా ప్రస్తుతం రష్యాను దాటేసి మూడో స్థానంలో కొనసాగుతుంది. ఈజాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా బ్రెజిల్ రెండవ స్థానంలో కొనసాగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: