సరిగ్గా కొద్ది రోజుల క్రితం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఆగస్టు 15 కల్లా కరోనా వైరస్ ను నివారించగలిగే వ్యాక్సిన్ covaxin ను మార్కెట్ లోకి రావాలని డెడ్లైన్ విధించిన విషయం తెలిసిందే. అయితే విషయమై శాస్త్రవేత్తలు మరియు వైద్య నిపుణులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఒక వ్యాక్సిన్ తయారీకి కావలసిన అన్నీ ప్రమాణాలను సరిగ్గా పాటించినట్లయితే ఎన్ని నెలలు లేదా సంవత్సరాల పడుతుందో ఐసీఎమ్ఆర్ కు తెలియనిది కాదని మరియు ఇటువంటి వాటికి డెడ్లైన్ విధించడం లో అసలు లాజిక్ లేదన్న వారి వాదన.

 

ఇక త్వరత్వరగా ఏదో ప్రజలను సంతోష పెడదాం అని వ్యాక్సింగ్ తయారు చేసి మార్కెట్లోకి వదిలితే అది మొదటికే మోసం వస్తుంది. దీంతో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ వ్యాక్సిన్ తయారీపై కచ్చితమైన సమాచారాన్ని నేడు అందించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 140 వ్యాక్సిన్ నమూనాలలో కేవలం 11 మాత్రమే హ్యూమన్ ట్రయల్స్ అనగా మనుషుల మీద ప్రయోగించుటకు సెలెక్ట్ అయ్యాయని.. వాటిలో భారత్ కు చెందిన covaxin, zyCov-D కూడా ఉన్నాయని తెలిపారు. ఇక పదకొండు వ్యాక్సిన్లలో ఒక్క వ్యాక్సిన్ కూడా 2021 లోపల మార్కెట్లోకి విడుదల అయ్యే అవకాశమే లేదని తేల్చి చెప్పేశారు.

 

ఒక వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ కు వెళ్ళింది అంటే బాగా ఆరోగ్యంగా ఉన్న వందలాది మంది మనుషులను సెలెక్ట్ చేసి వారికి వ్యాక్సిన్ ను ఎక్కిస్తారు. ఇక అంతకుముందే వారిలో ఉన్న వైరస్ పైన వ్యాక్సిన్ చూపే ప్రభావం మరియు మనిషిలోని కీలక అవయవాలలో వ్యాక్సిన్ రక్తంలో కలవడం వల్ల జరిగే ప్రక్రియ మొత్తం పరిశీలించి ఒక నివేదిక తయారు చేసి దానిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని నిర్థారించుకున్న తర్వాతనే దానిని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు అవసరమైన అనుమతిని ఇస్తారు.

 

కాబట్టి ప్రక్రియకు కనీసం ఎంతకాదన్నా ఒక ఆరు నెలల సమయం పడుతుంది. ఇక అన్నీ అనుమతులు వచ్చేందుకు మరి కొన్ని నెలలు పడుతుంది కాబట్టి 2021 లోపల వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం అయితే దాదాపు అసాధ్యమైన విషయం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: