ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 998 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క 2 కేసులతో 1000 కేసుల మైలురాయిని కోల్పోయింది జగన్ సర్కార్. ఇక రేపో విడుఅదల చేయబోయే బులిటెన్ లో మైలు రాయిని కచ్చితంగా దాటేసే అవకాశం ఉందని అందరూ అంచనాలు వేస్తున్నారు.

 

ఇక గత 24 గంటల్లో మరో 14 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో సంభవించిన కరోనా మరణాల్లో కర్నూలులో ఐదుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఇద్దరు, కృష్ణ, విశాఖపట్నంలో ఒక్కొక్కరు ఉన్నారు.

 

ఇకపోతే తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,697కు చేరింది. కర్నూలు జిల్లా -2,451,అనంతపురం జిల్లా -2,186.కృష్ణా జిల్లా - 1,743,గుంటూరు జిల్లా - 1,827,తూర్పుగోదావరి జిల్లా - 1,607,చిత్తూరు జిల్లా- 1,324,కడప జిల్లా - 1,245,పశ్చిమగోదావరి జిల్లా - 1,164,నెల్లూరు జిల్లా -730,ప్రకాశం జిల్లా - 700,విశాఖపట్నం జిల్లా - 721,విజయనగరం జిల్లా -215,శ్రీకాకుళం జిల్లా - 189,ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు- 2,179,ఇతర దేశాల నుంచి వచ్చిన వారు- 416,మొత్తం కేసులు - 18,697.

 

మొత్తం కరోనా మృతుల సంఖ్య 232కు చేరింది.శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 10,17,140 మందికి కరోనా టెస్టులు చేసినట్లు తెలిపారు. ఇది మాత్రం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గొప్ప ఘనత అనే చెప్పాలి. పది లక్షల కోవిడ్ టెస్టులు జరపడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: