జూలై 2 తేదీ తో పోలిస్తే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడినట్లు కనిపిస్తోంది. ఏంటి ఇది మన తెలంగాణనేనా..? నిజమా? అని ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. గత కొద్ది రోజులుగా తెలంగాణ లో టెస్టింగ్ ఆపివేసి ముందు రోజులలో తీసుకున్న శాంపిల్స్ వివరాలు ఇవన్నీ అని తెలుస్తోంది.

 

ల్యాబ్ సిబ్బంది లేక మరిత్య్ ప్రైవేట్ ల్యాబ్స్ పై వచ్చిన పలు ఆరోపణలతో కేసీఆర్ సర్కార్ ఒక రెండు రోజులుగా టెస్టింగ్ ఆపేసిన విషయం తెలిసిందే. ఇక తీవ్ర స్థాయిలో టెస్టింగ్ మొదలు పెడితే దీనికి రెట్టింపు కేసులు బయటపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

దీంతో గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో ఏడుగురు క‌రోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 295కి పెరిగింది.

 

ఒక్క రోజులో భారీగా 1166 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 12,703కి చేరింది. ప్ర‌స్తుతం 10,904 మంది చికిత్స పొందుతున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో అత్య‌ధికంగాగ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 1277 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మేడ్చ‌ల్‌లో 125 మందికి, రంగారెడ్డి జిల్లాలో 82 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: