దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది. ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అమెరికా తరువాత భారత్ లోనే భారీగా కేసులు నమోదవుతున్నాయని బ్రెజిల్, రష్యాలతో పోలిస్తే ఇండియాలో వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో కరోనా సోకినా చాలామందిలో లక్షణాలు కనిపించడం లేదు. అన్ లాక్ 2.0 సడలింపుల తరువాత దేశంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
 
కరోనా లక్షణాలు కనిపించని వారి నుంచే వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే లక్షణాలు కనిపించని వారు భయపడాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా కరోనా సోకిన సమయంలో జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు, ఇతర లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో వైరస్ సోకినా ఈ లక్షణాలు కనిపించవు. అయితే లక్షణాలు కనిపించకపోతే ప్రమాదమని చాలామంది భావిస్తున్నారు. 
 
అయితే నిపుణులు మాత్రం అలాంటి వాళ్లు భయపడాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నవారికే కరోనా లక్షణాలు కనిపించడం లేదని చెప్పారు. అలాంటి వాళ్లు కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. శ్వాసకోశ సమస్యలు ఉంటే తప్ప వారికి ఆస్పత్రిలో వైద్యం అవసరం లేదని... అయితే వాళ్ల నుంచి ఇతరులకు వైరస్ సోకిన పది రోజుల్లోనే వ్యాప్తి చెందుతుందని సమాచారం. 
 
ఎలాంటి వైద్యం లేకుండా కోలుకున్న వాళ్లు పాజిటివ్ అని తెలిశాక మానసికంగా కృంగిపోతున్నారని... మిగతా వాళ్లతో పోలిస్తే వీళ్లు వైరస్ నుంచి త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.               

మరింత సమాచారం తెలుసుకోండి: