ప్రపంచం కరోనా వల్ల పూర్తిగా స్దంభించి పోయిందన్న విషయం తెలిసిందే.. ఈ వైరస్ వల్ల ఉపాధికోల్పోయిన ఎందరో వారి భవిష్యత్తును, వారి పిల్లల భవిష్యత్తును ఊహించుకుని మానసిక వేధనకు గురవుతున్నారు.. కాగా మరోవైపు బయటకు వెళ్లితే ఈ కరోనా ఎక్కడ కాటువేస్తుందో అని భయపడుతున్నారు.. ఇలాంటి పరిస్దితుల్లో ఆకలితో చావడమా, ఈ వైరస్‌కు చిక్కి బ్రతికి బట్టకట్టడమా అనేది ఒక పజిల్‌లా మారింది..

 

 

ఇకపోతే ఈ కరోనా కట్టడికి అన్ని ప్రభుత్వాలు కృషిచేస్తున్నా, ఆదిలోనే ఈ వైరస్ విషయంలో కఠిన చర్యలు చేపట్టి దేశం చుట్టు ఈ నిబంధలను ఒక కంచెలా ఏర్పాటు చేసి అమలు చేస్తే ఈరోజు మనదేశంలో పరిస్దితి ఇంత దారుణంగా ఉండేది కాదనే అభిప్రాయాలు వెళ్లడవుతున్నాయట.. ఇదిలా ఉండగా కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధలను చాల మంది ఉల్లంఘించిన విషయం తెలిసిందే.. అయితే ఇలాంటి వారందరి ముక్కు పిండి జరిమానాను వసూలు చేసారు పోలీసులు.. ఇలా వసూలు అయినా జరిమాన ఒక్కో రాష్ట్రంలో కోట్లల్లో చేరింది.. ఈ కోవలోకే త‌మిళ‌నాడు చేరింది..

 

 

ఈ రాష్ట్రంలో  ట్రాఫిక్ పోలీసులు లాక్ డౌన్ ఉల్లంఘ‌నుల నుంచి సుమారుగా రూ. 17 కోట్ల‌ను వ‌సూలు చేశారట. ఇకపోతే మార్చి 24న ఇక్కడ లాక్ డౌన్  ప్రారంభ‌మైంది. అప్ప‌ట్నుంచి కరోనా నియమ నిబంధనలు పాటించని వారిపై పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారికి చ‌లాన్లు విధిస్తున్నారు. అయితే కేవలం స్పెష‌ల్ ఈ-పాస్ క‌లిగిన వాహ‌నాల‌కు మాత్ర‌మే అనుమ‌తిస్తున్నారు. కాగా ఈ-పాసుల‌ను మెడిక‌ల్ ఎమర్జెన్సీ, పెండ్లి, అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లే వారికి మాత్ర‌మే జారీ చేయగా మిగ‌తా వారికి మాత్రం ఇంటి నుంచి కేవ‌లం 2 కిలోమీట‌ర్ల ప‌రిధి వ‌ర‌కు అనుమ‌తిస్తున్నారు. ఒకవేళ 2 కి.మీ. ప‌రిధి దాటిన వారికి రూ. 600 జ‌రిమానా విధిస్తున్నారు. అవసరమైతే వాహ‌నాల‌ను సీజ్ కూడా చేస్తున్నారు.

 

 

ఇలా ఈ లాక్ డౌన్ కాలంలో నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారి నుంచి అక్షరాల రూ.16.92 కోట్ల జ‌రిమానా వ‌సూలు చేశారట. అంతే కాదు 7.28 ల‌క్ష‌ల కేసులు న‌మోదు అవగా, వేయిల సంఖ్యలో వాహ‌నాల‌ను సీజ్ చేసినట్లుగా ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారట.. ఏది ఏమైనా ఈ కరోనా ప్రజలకు ఆదాయం లేకుండా చేసినా, పోలీసు డిపార్ట్‌మెంట్ వారికి మాత్రం అనుకూలంగా మారిందనుకుంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: