కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఎన్నో కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసాయి. దీంతో ఉద్యోగులు అంత ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కదలకుండా ఒక చోటా కూర్చొని పని చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోయినప్పుడే మేలు కనీసం ఈ సమయం నుండి ఈ సమయం వరకు అని టైం టేబుల్ అయినా ఉండేది. ఇప్పుడు ఉదయం లేదు రాత్రి లేదు అంటూ అందరూ వాపోతున్నారు. 

 

ఇంకా ఒకే చోటా కూర్చోవడం.. ఒకే చోటా తినడం.. గంటలు గంటలు విశ్రాంతి లేకుండా ఉండడం వల్ల ఎంతోమంది అధిక బరువు పెరిగిపోతున్నారు. ఎప్పుడు తినే అంత తిన్నప్పటికీ బరువు దారుణంగా పెరిగిపోతున్నారు. అయితే గంటలు గంటలు కంప్యూటర్ మీద కూర్చోవడం వల్ల అధిక బరువు పెరిగిపోతున్నారు. కానీ ఈ విషయాన్నీ ఎవరు గమనించలేకపోతున్నారు. నిజానికి గంటకు ఒకసారి అయినా అటు ఇటు తిరాగాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. 

 

IHG

 

ఇంకా రోజుకు ఒక గంట సేపు అయినా వ్యాయామం చెయ్యాలి. లేకుంటే నిజంగా బరువు పెరిగిపోతారు. ఇంకా మీరు ఇలా చెయ్యకపోతే పైన ఉన్న ఫొటోలో లావుగా కనిపిస్తున్నారు కదా! ఇలా లావు అయిపోతారు. కంటి సమస్యలు వస్తాయిని అంటుంది డైరెక్టీ అప్లై సంస్థ‌. ఇంకా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఈ సమస్యలు వస్తాయి.. 

 

కంప్యూట‌ర్ విజ‌న్ సిండ్రోమ్‌

 

వెన్నెముక వంగిపోవ‌డం

 

రిపిటేటివ్ టైపింగ్ స్ట్రైన్‌

 

జుట్టు రాలిపోవడం

 

డార్క్ స‌ర్కిల్స్‌

 

మెడ‌పై అధిక‌భారం, వెన్ను నొప్పి

 

చ‌ర్మంపై ముడ‌త‌లు

 

ఊబ‌కాయం

 

చ‌ర్మం పొడిబారి, నిర్జీవంగా మార‌డం ( విట‌మిన్ డీ, డీ-12 లేక‌పోవ‌డం వ‌ల్ల‌)

 

తీవ్ర ఒత్తిడి

 

ఈ సమస్యలను అధిగమించాలి అంటే రోజుకు ఒక గంట సేపు వ్యాయామం చెయ్యడం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. అప్పుడే ఇలాంటి సమస్యలు రావు. 

మరింత సమాచారం తెలుసుకోండి: