ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చైనా పాకిస్థాన్ దేశాలు వణికిపోతున్నాయి . ఎందుకంటే మొన్నటికి మొన్న బాలాకోట్ లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది భారత్.. అంతే కాకుండా భారత సైన్యం సత్తా ఏమిటి అన్నది పాకిస్తాన్ కి పూర్తిగా తెలుసు. అదే సమయంలో చైనా కి కూడా భారత సైనిక సామర్థ్యం గురించి తెలుసు ఎందుకంటే మొన్నటికి మొన్న భారత సైనికులు ఎటాక్ చేసి ఎలా పోరాడారు అన్నది చూసింది  చైనా. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో  రాబోయే రోజుల్లో ఏమవుతుంది అన్నది ప్రస్తుతం అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది. చైనా ప్రజల్లో కూడా ఇలాంటి ఆందోళన నెలకొంది. 

 

 ఈ నేపథ్యంలో సరికొత్త ప్రచారానికి తెరలేపాయి రెండు దేశాలు. పాకిస్తాన్ చైనా దేశాలు ప్రచార యుద్ధాన్ని ప్రారంభించి ప్రస్తుతం భారత్  అంటే ఉన్న భయాన్ని తొలగించేందుకు వివిధ ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం చైనా దాడికి ఇండియా కు క్లిష్ట పరిస్థితి ఏర్పడిందని  అదే సమయంలో మరో వైపు ఉగ్రవాదుల దాడిని కూడా ఇండియా సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతుందని ప్రచారం చేస్తుంది పాకిస్తాన్ చైనా. అయితే ఇలాంటి వార్తలు రాయడం ద్వారా అక్కడి ప్రజల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

 


 ప్రస్తుతం పాకిస్థాన్లోని మీడియా సంస్థలు అన్నీ కూడా ఇలాంటి  ప్రచారానికి తెరలేపి ప్రచార యుద్ధం చేస్తున్నాయి. భారత్ అవమానించే విధంగా అంతేకాకుండా భారత శక్తిని తక్కువగా చూపించే విధంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఎన్ని ప్రచారాలు చేసినప్పటికీ అక్కడి ప్రభుత్వం పై మాత్రం ప్రజలకు పూర్తి నమ్మకం కలగడం లేదు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న వాదన. ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ భారతదేశ శక్తిని తక్కువ చేసి చూపిస్తూ భారత్ ని అవమానిస్తున్నప్పటికీ పాకిస్తాన్ చైనా దేశాల ప్రజలు మాత్రం ఇంకా భయంతో లోనే ఉన్నారు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: