ఇటీవల ఓ గ్యాంగ్ స్టార్ ఏకంగా పోలీసులపై ఎదురు కాల్పులు జరిపి పరారయ్యిన ఉదంతం  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వికాస్ దూబే అనే గ్యాంగ్ స్టార్ ను  పట్టుకునేందుకు వెళ్లగా.. పోలీసులపై  ఏకంగా ఎదురుకాల్పులు  జరిపి  ఏకంగా ఎనిమిది మంది పోలీసులను హతమార్చాడు గ్యాంగ్ స్టార్ దూబే.  ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ గ్యాంగ్ స్టార్  విషయమే  ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. వెంటనే యోగి ప్రభుత్వం రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాల విమర్శలకు దిగారు. 

 

 మరోవైపు సదరు గ్యాంగ్ స్టార్ తల్లి కూడా వాడు నా కొడుకే కాదు వాడిని ఏమైనా చేసుకోండి అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతం దూబే ఆచూకీ మాత్రం దొరకడం లేదు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు ఆ గ్యాంగ్ స్టార్. ఈ క్రమంలోనే ప్రస్తుతం దూబే ను  వెతకడం తో పాటు అతని అనుచరులను వెతికే పనిలో కూడా నిమగ్నమయ్యారు యూపీ పోలీసులు. నిజంగా ఉత్తరప్రదేశ్ లో యోగి  సర్కార్  కి  ఇదొక  పరీక్షగా మారింది అని చెప్పాలి. అయితే ఇప్పటికే దూబే గ్యాంగ్ లోని ఒక్కొక్కరిని అనుచరులను ఎన్కౌంటర్ చేసే పనిలో ఉంది ప్రస్తుతం యూపీ సర్కార్. 

 

 ఇప్పటికే దూబే కి గ్యాంగ్ లోని  ముగ్గురు అనుచరులు ఎన్ కౌంటర్ కి గురయ్యారు అయినటువంటి తాజా సమాచారం. మరి కొంతమంది కోసం వేటాడుతూ  వెంటాడుతున్నారు యూపీ పోలీసులు. ప్రస్తుతం వారిని కూర్చోబెట్టి విచారించే  ఉద్దేశం ప్రభుత్వానికి గానీ వారి ప్రాణాలతో వదిలిపెట్టి ఉద్దేశం పోలీస్ శాఖ కి గాను లేదు అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. మామూలుగానే యూపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రౌడీయిజం పై ఉక్కుపాదం మోపి చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలో లాగానే ప్రస్తుతం దూబే విషయంలో యోగి మార్క్ ఎన్కౌంటర్ తప్పదు అన్న టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: