దేశంలో కరోనా విజృభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ మహమ్మారిని కొంత మేరకు అయినా అరికట్టడానికి దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి విదితమే. అయితే లాక్ డౌన్ కారణంగా దేశంలో చాల మంది నానా అవస్థలు పడుతున్నారు. అయితే దేశ ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పథకాలను అమలులోకి తీసుకొచ్చాయి. ఇంతక ముందు ఉన్న పథకాలలోనే కొన్ని మార్పులు చేస్తూ ప్రజల ముందుకు తీసుకొస్తుంది.

 

 

అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ రూల్స్‌ను సవరించిందన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మోదీ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో ఈ పథకంలో చేరాలని యోచించే వారికి ప్రయోజనం కలుగనుందని తెలియజేశారు.

 

 

అయితే కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెనింగ్ ఎలిజిబిలిటీ రూల్స్‌ను సవరించిందని తెలియజేశారు. సాధారణంగా సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేయాలంటే 10 ఏళ్లలోపు వయసు ఉండాలన్నా విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పదేళ్లు దాటినా కూడా ఈ పథకంలో చేరొచ్చునని తెలిపారు. దీనికి సంబంధించి రూల్‌ను సవరించిందన్నారు.

 

 

సుకన్య సమృద్ధి అకౌంట్‌ను ఆడ పిల్ల పేరుపై తెరవొచ్చునన్నారు. ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు ఆడ పిల్లలపై ఈ ఖాతా ఓపెన్ చేయొచ్చునన్నారు. అయితే కొత్త రూల్ కేవలం జూలై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. అంటే ఇప్పుడు ఆడ పిల్లకు పదేళ్లు దాటినా కూడా జూలై 31లోపు ఈ స్కీమ్‌లో చేరొచ్చునన్నారు.

 

 

అయితే లాక్ డౌన్ సమయంలో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ను తెరవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఊరట కలుగనుందని తెలియజేశారు. అయితే ఇకపోతే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌పై 7.6 శాతం వడ్డీ లభిస్తోందన్నారు. ఇతర స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో కెల్లా ఈ పథకంపైనే ఎక్కువ వడ్డీ వస్తోందని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: