దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడే బాధితుల సంఖ్యా పెరుగుతూనే ఉంది కాని తరగడం లేదు. ఇప్పటికే ఈ మహమ్మారి పల్లెలకు కూడా వ్యాపించటం మొదలు పెట్టింది. మరోవైపు ఈ మహమ్మారి కారణంగా చాలా మంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వారికీ అండగా ప్రభుత్వం కొన్ని స్కీమ్ ల ద్వారా రుణాలను అందజేసింది. 

 

 

అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా రుణ గ్రహీతలకు షాకిచ్చిందని సమాచారం. ఆర్‌బీఐ మారటోరియం ఆప్షన్ ఎంచుకున్న వారికి వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనం లభించదని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే లోన్‌ మారటోరియం ఫెసిలిటీ పొందిన వారికి అధిక వడ్డీ పడుతుందని తెలియజేశారు.

 

 

ఇది కేవలం ముద్రా శిశు లోన్ తీసుకున్న వారికే వర్తిస్తుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కోవిడ్ 19 ప్యాకేజీ కింద ముద్రా శిశు లోన్ తీసుకున్న వారికి వడ్డీ తగ్గింపు ప్రయోజనాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వీరికి వడ్డీ రేటులో 2 శాతం రాయితీ లభిస్తుందన్నారు. జూన్ దగ్గరి నుంచి ఏడాది పాలు ఈ బెనిఫిట్ అందుబాటులో ఉంటుందన్నారు.

 

 

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం తాజాగా ఈ అంశంపై స్పష్టత ఇచ్చిందన్నారు. ఆర్‌బీఐ మారటోరియం ఆప్షన్ ఎంచుకున్న కస్టమర్లకు మాత్రం వడ్డీ రేటు తగ్గింపు ప్రయోజనం లభించదని పేర్కొన్నారు. దీంతో మారటోరియం ఫెసిలిటీ పొందిన వారికి వడ్డీ రేట్ల తగ్గింపు అందుబాటులో ఉండదన్నారు. 

 

 

అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి సిడ్బికి ఆదేశాలు కూడా జారీ చేసిందన్నారు. మారటోరియం ఆప్షన్ ఎంచుకున్న వారికి వడ్డీ రేటు తగ్గింపు బెనిఫిట్ అందించొద్దని తెలియజేశారు. కోవిడ్ 19 ప్యాకేజీ నిర్వహణ బాధ్యతలు సిడ్బీనే చూసుకుంటోందన్నారు. కాగా ముద్రా శిశు లోన కింద రూ.50,000 వరకు లోన్ తీసుకోవచ్చునాని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: