ప్రస్తుతం ఏపిలో కరోనా వైరస్ విజృంభిస్తుంది.  ఈ నేపథ్యంలో మొన్నటి వరకు లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరూ బయటకు రాకుండా ఉండటంతో జీవనోపాది కష్టతరంగా మారిపోయింది.  ఈ మద్య వ్యాపారులు బయటకు వచ్చి తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. కులవృత్తుల వారు తమ జీవనోపాది కొనసాగిస్తున్నారు.  ఈ నేపథ్యంలో మత్స్యకారులు కూడా రంగంలోకి దిగారు. తాజాగా చేపల కోసం రెండు గ్రామాల ప్రజలు కొట్లాడుకున్నారు. ఈ కొట్లాటలో గాయపడ్డ 12 మందిని ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లాలోని రొద్దం మండలం తురకల పట్నం చేపల చెరువు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 

 

ఈ మద్య ఏపిలో భారీ వర్షాలకు గ్రామంలోని చెరువుకు కృష్ణా జలాలు భారీగా వచ్చి చేరాయి. దీంతో తురకలపట్నం, పెద్ద కోడిపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు చెరువులోని చేపల విషయంలో వాదించుకున్నారు.  గతంలో పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన చేపల సొసైటీ ఉందని.. కాబట్టి తమకు ఆ చెరువుపై సర్వాధికారాలు ఉంటాయని ఆ గ్రామ ప్రజలు అన్నారు.  అయితే తురకపట్నం గ్రామంలోనే చెరువు ఉంది కాబట్టి చేపలు పట్టే అధికారం తమకు ఉంటుందని తురకపట్నం గ్రామస్తులు వాదానికి దిగారు.

 

అంతే ఇరు వర్గాల మద్య మాటల యుద్దం మొదలైంది.. దాంతో ప్రజలు కర్రలతో ఒక్కసారిగా దాడులకు దిగారు. ఈ దాడిలో 12 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ ఆసుపత్రికి తరలించారు. తాము ఎంతో ఆవేదనతో మంచితనంతో మాట్లాడటానికి ప్రయత్నించినా.. పెద్దకోడిపల్లి గ్రామస్తులు వినిపించుకోలేదని తురకపల్లి గ్రామ ప్రజలు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: