కరోనా రక్కసి ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో సరికొత్త రికార్డ్ నమోదైంది.  ఆదివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 2,12,000 కొత్త కేసులు నమోదవగా,  3586 మంది మరణించారు. ఈ కొత్త కేసుల్లో 60 శాతం అమెరికా, బ్రెజిల్‌ దేశాల్లోనే నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. అమెరికాలో నిన్న 40 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, బ్రెజిల్‌లో 24,431 కరోనా కేసులు వచ్చాయి.  కాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,15,56,641 మంది కరోనా బారిన పడ్డారు. వైరస్ కాటుకు 5,36,776 మంది చనిపోయారు. అమెరికాలో 29,82,928 కరోనా పాజిటివ్‌ కేసులు  ఉన్నాయి.

 

మరోవైపు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాల్లో రష్యా మూడో స్థానంలో ఉండగా.. దాన్ని భారత్‌ దాటేసింది. అగ్రరాజ్యం అమెరికాలో నిన్న 40వేలకు పైగా కేసులు నమోదవడంతో మొత్తం కరోనా కేసులు 30 లక్షలకు చేరువలో ఉన్నది. దేశంలో ఇప్పటివరకు 29,82,928 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల 1,32,569 మంది మరణించారు. అత్యధిక కరోనా కేసుల జాబితాలో నిన్నటి వరకు మూడో స్థానంలో ఉన్న రష్యాను భారత్‌ వెనక్కి నెట్టివేసింది.

 

దేశంలో ఆదివారం సాయంత్రం వరకు మొత్తం 6.9 లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో రష్యా నాలోగో స్థానానికి పడిపోయింది. భారత్‌లో ఇప్పటివరకు 6,97,836 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల 19,700 మంది బాధితులు మృతిచెందారు. మొన్నటి వరకు కేసలు విషయంలో భయపడ్డ రష్యా లో 6,81,251కి చేరగా, 10,161 మంది చనిపోయారు. ఐదోస్థానంలో ఉన్న పెరూలో 3,02,718 మంది కరోనా బారినపడగా, 10,589 బాధితులు చనిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: