దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. అడ్డూఅదుపు లేకుండా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. అత్యధిక కేసులు నమోదన దేశాల జాబితాలో మూడో స్థానానికి చేరటానికి భారత్ కు ఇంకెంతో సమయం పట్టేలా లేదు. అమెరికా 29 లక్షల కేసులతో తొలి స్థానంలో ఉండగా భారత్ 15 లక్షల కేసులతో రెండవ స్థానంలో ఉంది. దేశంలో నమోదైన కేసుల్లో 70 శాతం కేసులు టాప్ 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. 
 
మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీల్లో రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. ఇతర దేశాల్లో నమోదైన కేసుల కంటే మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నా రికవరీ రేటు ఎక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. జాతీయ సగటుతో పోలిస్తే 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ రేటు ఎక్కువగా ఉంది. 
 
మరోవైపు నిర్లక్ష్యం వల్లే వైరస్ వ్యాప్తి చెందుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కరోనా రోగులు నిబంధనలు పాటించకపోవడం వల్ల సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నారు. కొందరు కరోనా సోకిందని తెలిసినా ఆ విషయం పక్కవారికి తెలియకుండా జాగ్రత్తపడుతూ.. ఇష్టానుసారంగా జనాల్లో తిరిగేస్తూ ఉండటంతో అమాయక ప్రజలు వైరస్ భారీన పడుతున్నారు. 
 
చాలా మంది కరోనా పరీక్షల సమయంలో తప్పుడు చిరునామాలు, ఫేక్‌ ఫోన్‌ నెంబర్లు ఇస్తున్నారు. మరోవైపు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సైతం వైరస్ భారీన పడుతున్నారు. కరోనా సోకిన వారి నిర్లక్ష్యం వల్ల పలువురికి వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రైమరీ కాంటాక్టుల వల్ల కూడా కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.              

మరింత సమాచారం తెలుసుకోండి: