ప్రపంచ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోల్లం సృష్టిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ మహమ్మారిని అరికట్టడానికి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొనడంలో నిమగ్నులైయ్యారు. అయితే మహమ్మారి ఎక్కువగా గాలిలో వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెపుతున్నారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మోచేతిని అడ్డం పెట్టుకొని తుమ్మాలని అదేవిధంగా చేతుల్ని తరచుగా శుభ్రం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణులు సూచించిన విషయం తెలిసిందే.

 

 

అయితే శాస్త్రవేత్తల బృందం ప్రపంచ ఆరోగ్య సంస్థకు బహిరంగ లేఖ రాశారు. వచ్చే వారం సైంటిఫిక్ జర్నల్‌లో దీనిని ప్రచురించాలని భావిస్తున్నారని తెలిపారు. మొత్తం 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కణాలు గాలి ద్వారా సంక్రమిస్తాయనే ఆధారాలను వివరించారు. దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని రాయిటర్స్ పేర్కొన్నారు.

 

 

అయితే కరోనా బాధితుడు తుమ్మినా, దగ్గిన తర్వాత వెలువడే కణాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్నారు. ఇది వైరస్‌కు కారణమవుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందన్నారు. శాస్త్రవేత్తలు తమ లేఖలో పేర్కొన్నారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటోందని తెలియజేశారు.

 

 

ఈ వైరస్ ముఖ్యంగా గాలి ద్వారా సంక్రమిస్తుందనే విషయమై గత రెండు నెలలుగా అనేకసార్లు పరిగణించరన్నారు. కానీ దీనికి ఖచ్చితంగా లేదా స్పష్టమైన ఆధారాలు దొరకలేదని డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ విభాగం అధిపతి డాక్టర్ బెనీడెట్టా అలెగ్రాంజీ తెలియజేశారు.

 

 

ఇప్పటికే కరోనా వ్యాప్తికి సంబంధించి ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయన్నారు. కరోనా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా లేదా అనేది వాటిలో ప్రధానమైన సందేహం అని తెలియజేశారు. గాలి ద్వారా కరోనా వ్యాపించదని అనేకమంది నిపుణులు తెలియజేస్తున్నప్పటికీ మెడ్‌ ఆర్‌ఎక్స్‌ఐవీ అనే సంస్థ వెల్లడించిన పరిశోధనలో ఇది సాధ్యమే అని తెలిపారు. ఇది అత్యంత అరుదుగా మాత్రమే జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: