1901, జూలై 6 న జన్మించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ, హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ, జనసంఘ్‌ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందినాడు. సాధారణంగా ప్రజాదరణ ఉన్న నాయకులు అదృశ్యమైనా, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినా నిజానిజాలు తెలుసుకునేందుకు విచారణ కమిషన్‌ వేస్తారు. కానీ, శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ అనుమానాస్పద మృతిపై విచారణ కమిషన్‌ వేయాలన్న డిమాండ్‌ను నాటి ప్రధాని నెహ్రూ తిరస్కరించారు. అయినా ముఖర్జీ త్యాగం వృథా పోలేదు. ఆయన నాయకత్వంలో ఆవిర్భవించిన బిజెపి ఇప్పుడు పూర్తి స్థాయి మెజారిటీతో కేంద్రంలో, అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తోంది. శ్యాంప్రసాద్ ముఖర్జీ 1901 జూలై 6 న కోల్‌కతలో జన్మించాడు.

 

తండ్రి అశుతోష్ ముఖర్జీ బెంగాల్‌లో గౌరవాదరణ కలిగిన న్యాయవాది, కలకత్తా విశ్వవిద్యాలయానికి కులపతిగా పనిచేసిన ప్రముఖుడు. తల్లి పేరు జోగ్‌మాయా దేవి ముఖర్జీ.  ముఖర్జీ డిగ్రీ విద్యాభ్యాసం కోల్‌కత లోనే కొనసాగింది. 1921లో ఆంగ్లంలో మొదటి స్థానంలో పట్టా పుచ్చుకున్నాడు. 1923లో ఎంఏ పట్టా పొందినాడు. 1924లో న్యాయవాద పట్టా కూడా స్వీకరించాడు. తండ్రి మరణానంతరం 1924 లో కలకత్తా హైకోర్టులో అడ్వకేట్‌గా పేరు నమోదుచేసుకున్నాడు. ఆ తరువాత ఇంగ్లాండుకు పయనమై 1927లో బారిష్టరు పట్టా పొందినాడు. 1934లో 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయపు కులపతిగా నియమించబడి, పిన్న వయస్సులో ఈ పదవిని పొందిన ఘనత పొందినాడు. 

 

తమ దేశంలో నివసించడానికి ఒక రాష్ట్రంలో అర్హత లేకపోవడానికి, గుర్తింపు చూపవలసి రావడం తదితర కారణాల వల్ల 1953లో కాశ్మీర్ వెళ్ళి నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించి సరిహద్దు వద్ద మే 11 న అరెస్టు అయ్యాడు. అతని ప్రయత్నం వల్ల గుర్తింపుకార్డు నియమం తొలిగించబడిననూ అంతవరకు ముఖర్జీ సజీవంగాలేడు. జూన్ 23, 1953 న కస్టడీలోనే ముఖర్జీ ప్రాణాలు వదిలాడు. ముఖర్జీ మరణంపై అనుమానాలు తలెత్తి విచారణ జరుపవలసిందిగా కోరిననూ ప్రభుత్వం ఎలాంటి విచారణ జరుపలేదు. ముఖర్జీ తల్లి జోగ్మాయా దేవి ప్రత్యేకంగా ప్రధాని నెహ్రూను కోరిననూ ఫలితం దక్కలేదు. ముఖర్జీ మరణం ఇప్పటికీ అనుమానాస్పదమైన అంశంగానే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: