భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో తాజాగా ‘బుబోనిక్‌ ప్లేగు’ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.  ఇప్పటికే చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనాతో ప్రపంచం మొత్తం అల్లల్లాడుతుంది. ఇది చాలదని ఈమధ్యే కొత్తగా G-4 అనే కరోనాను మించిన వైరస్ కూడా తమ దేశంలో ఉన్నట్లు చైనా పరిశోధకులు చెప్పారు. ఇప్పుడు మరో చేదు వార్త చెప్పారు. అదే బుబోనిక్ ప్లేగు. దాదాపు ఇది కూడా ఒక రకంగా కరోనా లాంటి వైరస్ అని.. కాకపోతే ఇది సోకితే... జ్వరం, చలి, తలనొప్పి, ఒంటిపై వాపులు, శరీరంపై పుండ్లు, లింప్ గ్రంధుల్లో నొప్పి వంటివి వస్తాయని అంటున్నారు.

IHG

ఇప్పటికే ఇది సోకిన ఓ వ్యక్తిని ఉత్తర చైనాలోని బయన్నుర్ సిటీ డాక్టర్లు గుర్తించారు. అతని ఫ్యామీలీ, చుట్టుపక్కల వారు.. అతని స్నేహితులందరినీ గుర్తించి... ఐసోలేట్ చేశారు. అందరికీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఎందుకైనా మంచిదని స్థానిక ప్రజలకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలను అప్రమత్తం చేసేందుకు లెవల్‌-3 ప్రమాద హెచ్చరికలను జారీచేశారు అధికారులు.

IHG

ఈ ఏడాది చివరి వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అసాధారణ లక్షణాలు కనిపిస్తే వైద్యులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చైనాకు ఉత్తర సరిహద్దులో ఉన్న మంగోలియా లోనూ బుబోనిక్ ప్లేగు‌ వేగంగా వ్యాపిస్తోంది.  ఇది ఎలుకలు, గుమ్మడి పురుగులను వాహకాలుగా వాడుకుంటుంది. అవి మనుషులను కుడితే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌ను కలుగజేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: