ప్ర‌పంచంలో అత్యంత జ‌నాభా క‌లిగిన దేశాల్లో ఇండియాది రెండో స్థానం.. ఇప్పుడు అదే ఇండియాలో మూడో స్థానం సాధించింది. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారి విష‌యంలో భార‌త్ ఇప్పుడు స‌రికొత్త రికార్డుల దిశ‌గా దూసుకు పోతోంది. ఈ రికార్డు ఏంటో ?  ఇందుకు కార‌ణం ఎంటో తెలిస్తే మీరే షాక్ అవుతారు. ప్ర‌పంచ జ‌నాభాలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన ఇండియా ఇప్పుడు ప్ర‌పంచంలోనే పై పైకి పోతుంది. క‌రోనా కేసుల విష‌యంలో చెత్త రికార్డును మ‌న భార‌త్ మూట క‌ట్టుకునే దిశ‌గా దూసుకు పోతోంది. 

 

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచంలోనే అగ్ర రాజ్యం, పెద్ద‌న్న అయిన అమెరికా క‌రోనా కేసుల విష‌యంలో ప్ర‌పంచంలోనే మొద‌టిస్థానంలో అమెరికా నిలిచింది. ఇక రెండో స్థానంలో బ్రెజిల్ ఉండ‌గా, మూడో స్థానంలో ఇండియా నిలిచింది. అయితే ఇప్పుడు ఇండియాలో కేసుల సంఖ్య రోజు రోజుకు విప‌రీతంగా పెరిగిపోతోంది. స‌గ‌టున గ‌త కొద్ది రోజులుగా మ‌న దేశంలో 20 వేల కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇక మ‌రాణాలు కూడా 20 వేల‌కు చేరువ అవుతున్నాయి.

 

ఇండియాలో క‌రోనా కేసులు భారీగా పెరుగుతుండంతో ప్ర‌జ‌లు భ‌యం భ‌యంగా బ‌తికేస్తున్నారు. క‌రోనా విష‌యంలో ముందు చాలా క‌ఠినంగా ఉన్న కేంద్ర ప్ర‌భుత్వం.. ఆ త‌ర్వాత తూతూ మంత్రంగా పనిచేస్తుంద‌‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు కోటి 15 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. ఇక ఇండియాలో క‌రోనా రేటు చూస్తే త్వ‌ర‌లోనే బ్రెజిల్‌ను దాటేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి ఇక‌పై అయినా క‌రోనా విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌లు తీసుకోక పోతే భార‌త్ లో క‌రోనా ప్ర‌ళ‌యం త‌ప్ప‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: