కరోనా అంటేనే జనం భయపడిపోతున్నారు. కానీ.. కరోనా గురించి మరీ అంత భయం అవసరం లేదంటున్నారు దాన్ని జయించిన వాళ్లు. కరోనా క్రిమిని ఎదుర్కొనే శక్తి మనలో ఉన్నా అనవసర భయాందోళనలతో మనం పూర్తిగా కుంగిపోతున్నామని .. ఆ అవసరం లేదని చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించడం అంత కష్టమేమీ కాదంటున్నారు. 

 

 


కరోనా అంటే ఆరోగ్య సమస్యలు లేనివారు కూడా భయపడుతున్నారు. ఇక ఆస్తమా, శ్వాస సంబంధిత, ఊపిరితిత్తుల సమస్యలున్నవారైతే వారికి పైప్రాణాలు పైనే పోతున్నాయి. కానీ.. ఇతర రోగాలు ఉన్నవారు కూడా గట్టి సంకల్పంతో పోరాడి గెలిచారు. పూర్తిగా కోలుకున్నారు. ఇంటికే పరిమితమై వంటింటి చిట్కాలతో విజయం సాధించారు. 

 

IHG


కరోనాను గెలిచిన వారిలో కొందరు ఏం చెబుతున్నారంటే.. ఉదయం ముఖం కడుక్కున్నాక వెంటనే పాలు వేడి చేసుకుని అందులో అల్లం, పసుపు, మిరియాలు వేసుకుని తాగేవారట. రోజూ 2 ఉడకబెట్టిన కోడిగుడ్లు తినేవారట.  తర్వాత వేడి నీటిలో దాల్చిన చెక్క, మిరియాలు, అల్లం, పసుపుతో మరిగించిన కషాయాన్ని రోజుకు రెండుమూడుసార్లు తాగారట. వీటితోపాటు అల్లం, పసుపు మరిగించిన వేడినీటితో తరచూ ఆవిరి పట్టడంతో శ్వాస సంబంధిత సమస్యలు దరిచేరలేదని తమ అనుభవాలు పంచుకుంటున్నారు. 

 

 


ఇక మధ్యాహ్నం, రాత్రి భోజనంలోకి కోడి, చేప మాంసాన్ని తీసుకున్నారట.. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరిగిందని చెబుతున్నారు. వీటి కారణంగా తాము త్వరగా కోలుకునేలా చేశాయంటున్నారు. అందుకే కరోనా రాగానే బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు.. ధైర్యం కూడదీసుకుని దాన్ని ఎదుర్కొంటే విజయం చాలా సులభం. ఇందుకు అనేక మంది సాక్ష్యాలుగా ఉన్నారు. అందుకే ధైర్యంగా ఉండండి. కరోనాను ఎదుర్కోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: