కరోనా వారియర్స్.. ఈ మధ్య ఈపదం బాగా వాడుకలోకి వచ్చింది. కరోనాకు భయపడకుండా కరోనాతో పోరాడే వృత్తుల వారి గురించి ఈ పేరు వచ్చింది. వైద్యులు, వైద్య సిబ్బంది, అత్యవసరసేవల సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, పాత్రికేయులు ఈ కరోనా వారియర్స్ జాబితాలోకి వస్తారు. ఇందులో ఒక్క పాత్రికేయులు తప్ప.. అంతా దాదాపు ప్రభుత్వోద్యోగులే. 

 


కరోనాతో పోరాడుతున్నా వారికి మిగిలిన సౌకర్యాల విషయంలో పెద్దగా లోటు లేదు. ప్రభుత్వాలు కూడా వారి జీతభత్యాల్లో కోత వేయలేదు. ఇప్పుడు అందరికీ జీతాలు ఇస్తున్నారు. కానీ ప్రభుత్వోద్యోగులు కాకపోయినా కరోనా రిస్క్ ఉన్నా విధులు నిర్వహిస్తున్నది పాత్రికేయులే. కరోనా గురించి వార్తలు అందించడంలోభాగంగా వీరు కరోనా రోగులున్న ఆసుపత్రుల్లోకి.. అధికారుల కార్యాలయాల్లోకి.. రోగుల ఇళ్ల ప్రాంతాల్లోకి వెళ్తున్నారు. 

 

IHG' working conditions hit hard by coronavirus- The New ...


అందుకే జర్నలిస్టులు కూడా పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో సుమారు 100 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక టీవీ జర్నలిస్టు చనిపోయాడు. ఆ కుటుంబానికి పెద్ది దిక్కు లేకుండా పోయింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా వందలాది మంది జర్నలిస్టులు వైరస్ బారిన పడ్డారు. హైదరాబాద్, చెన్నై, ముంబయి, ఢిల్లీ తదితర నగరాల్లో కొందరు కరోనాతో జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు.

 


ఇక మీడియా సంస్థల యాజమాన్యాలు కూడా వీరి గురించి అంతగా పట్టించుకోవడం లేదు. ఇక పత్రికలైతే.. కరోనా పేరుతో జిల్లాల టాబ్లాయిడ్‌లు ఎత్తేశాయి. వందల మంది డెస్క్ జర్నలిస్టులు రోడ్డున పడ్డారు. కేంద్ర ప్రభుత్వం కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్లకు బీమా సౌకర్యం కల్పించినా జర్నలిస్టులను ఆ జాబితాలో చేర్చలేదు. పలు మీడియా సంస్థలు వేతానాల్లో 25 శాతం నుంచి 70 శాతం దాకా కోత పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: