చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది.  ప్రపంచంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఆదివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 2,12,000 కొత్త కేసులు నమోదవగా,  3586 మంది మరణించారు. ఈ కొత్త కేసుల్లో 60 శాతం అమెరికా, బ్రెజిల్‌ దేశాల్లోనే నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. అమెరికాలో నిన్న 40 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, బ్రెజిల్‌లో 24,431 కరోనా కేసులు వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,15,56,641 కరోనా కేసులు నమోదయ్యాయి.

 

ఈ వైరస్‌ వల్ల 5,36,776 మంది చనిపోయారు. ఇప్పటివరకు ఈ వైరస్‌ భారినపడినవారిలో 65,34,851 మంది కోలుకోగా, మరో 44,85,014 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక భారత దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  గత 24 గంటల్లో భారత్‌లో 24,248 మందికి కొత్తగా కరోనా సోకిందని తెలిపింది. అదే సమయంలో 425 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 6,97,413 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 19,693కి పెరిగింది. 2,53,287 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  

 

నిన్నటి వరకు దేశంలో మొత్తం 99,69,662 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 1,80,596 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,24,433 మంది కోలుకున్నారు. ఇటీవల లాక్ డౌన్ సడలించిన తర్వాత ఎక్కువగా వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లారు.. దాంతో ఈ కేసులు మరింత పెరుగుతూ వచ్చాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: