ఇప్పటికే మహమ్మారి వైరస్ మనందరినీ బాధిస్తోంది. అయితే ఇలాంటి టైం లో హాస్పిటల్ కి వెళ్లడం చాలా ప్రమాదం. కాబట్టి వీలైనంత వరకు రోగ నిరోధకశక్తిని పెంచుకుని అనారోగ్యం నుంచి బయట పడటం ఎంతో అవసరం. కాబట్టి ఆరోగ్యమైన పద్ధతులను అనుసరించడం ప్రతి ఒక్కరికి ఈ సమయంలో చాలా ముఖ్యం.  ఇటువంటి దుస్థితిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అనారోగ్యాల నుంచి ఎంత వీలైతే అంత వేగంగా  బయటపడాలి. మనిషి ఆరోగ్యం కిడ్నీల పనితీరు పై ఆధారపడి ఉంటుంది. ఏ సమస్య వచ్చిన శరీరం అదుపు తప్పుతుంది.

 

ఎందుకంటే శరీరానికి పోషకాలు అందించే విషతుల్యాలను బయటకు పంపేవి కిడ్నీలు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటం కూడా అత్యవసరం. కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అలాగే శరీరానికి అవసరం లేని వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. అలాంటి కిడ్నీలను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వారి కిడ్నీలని జాగ్రత్తగా చూసుకుంటూ కిడ్నీ ఆరోగ్యాన్ని కూడా బాగా ఉంచాలి. అయితే కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి...


కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు రోజుకో ఆపిల్ తీసుకోండి. ఆపిల్ తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధింత సమస్యలు తగ్గించవచ్చు యాపిల్లో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడానికి డయాబెటిస్ ని  నియంత్రణలో ఇవి ఉపకరిస్తాయి. కాబట్టి యాపిల్  ని కచ్చితంగా తినడం మర్చిపోకండి.

 

పుట్టగొడుగుల్లో విటమిన్ బి, విటమిన్ డి కిడ్నీ అనారోగాలని దూరం చేస్తాయి కాబట్టి రక రకాల పుట్టగొడుగుల్లో శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. కాబట్టి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అందుకే పుట్ట గొడుగులుని కూడా మీ డైట్ లో చేర్చుకోండి. వెల్లుల్లిని అనేక రకాల వంటకాల్లో మనం నిత్యం ఉపయోగిస్తూనే ఉంటాము. వెల్లుల్లి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కిడ్నీ నుంచి వ్యర్థాలను బయటకు పంపటానికి సహాయపడుతుంది. వీటితో పాటు మీరు లావు మిర్చి, స్ట్రాబెర్రీస్, ఓట్స్ కూడా తినొచ్చు. కాలీఫ్లవర్ ఉల్లిపాయలు తీసుకోవడం నీళ్లు ఎక్కువగా తాగడం కూడా కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: