కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ల మధ్య అసలు ఏం జరుగుతుంది అన్న చర్చ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. రెండు పార్టీల మధ్య శత్రుత్వం ఉందా లేకపోతే మిత్రత్వం ఉందా అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి మోడీతో జగన్ పార్టీ చాలా సఖ్యతతో మెలిగింది. అదే టైంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత చాలా విషయాల్లో జగన్ కి బీజేపీ ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఈ పరిణామంతో ఏపీ బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేసిన జగన్ ఏ మాత్రం బీజేపీ ని టార్గెట్ చేసిన సందర్భం లేదు.

 

అంతేకాకుండా చాలా సందర్భాలలో కేంద్ర ప్రభుత్వానికి వైయస్ జగన్ బహిరంగంగానే సపోర్ట్ చేయడం జరిగింది. మరోపక్క కేంద్ర పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని పదేపదే మీడియా ముందు చెప్పటం జరిగింది. తీరా జగన్ కేంద్ర పార్టీ పెద్దలతో అపాయింట్మెంట్ కోరిన సందర్భంలో ఇచ్చినట్లు ఇచ్చి చివరి నిమిషంలో క్యాన్సల్ చేయడం ఇటీవల జరిగింది. దీంతో ఆశలు మోడీ మరియు జగన్ ల మధ్య శత్రుత్వం లేకపోతే మైత్రి నా అన్నది ఎవరికీ అర్థం కావటం లేదు.

 

మరోపక్క జగన్ పార్టీ మీద ఒంటికాలిమీద రగిలిపోతున్న రఘురామకృష్ణంరాజు వెనకాల బీజేపీ పార్టీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం కి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేయటం తో ఈ విషయంలో కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏ మాత్రం వైయస్ జగన్ కి వ్యతిరేకంగా కేంద్రం ఈ విషయంలో స్పందిస్తే మోడీ మరియు జగన్ ప్రభుత్వాల మధ్య శత్రుత్వం నడుస్తున్నట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: