ప్రస్తుతం మనం క్రెడిట్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డ్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇందుకు ప్రధాన కారణం. అయితే క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్, రివార్డు పాయింట్లు, ఇన్‌స్టంట్ క్రెడిట్, లోన్ ఫెసిలిటీ వంటి పలు రకాల బెనిఫిట్స్ పొందొచ్చునని తెలిపారు. అయితే క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలని అధికారులు హెచ్చరించారు.

 

 

అయితే క్రెడిట్ కార్డును పాయింట్ ఆఫ్ సేల్, ఆన్‌లైన్‌లో ఉపయోగిస్తే 51 రోజుల వరకు వడ్డీ చెల్లించాల్సిన పని లేదన్నారు. అయితే ఇక్కడ క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుంచి కూడా డబ్బులు తీసుకోవచ్చునన్నారు. క్రెడిట్ కార్డు బిల్లును ఎప్పటికప్పుడు చెల్లిస్తూ రావాలన్నారు.

 

 

ఒకవేళ బిల్లు మొత్తాన్ని వచ్చే నెల కట్టొచ్చని భావిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు అన్నారు. ఫైనాన్స్ చార్జీలు, వడ్డీ వంటివి పడతాయన్నారు. అందువల్ల వీలైనంత వరకు బిల్లు ప్రతి నెలా చెల్లిస్తూ వస్తే మంచిదన్నారు. ఒకవేళ బిల్లు మొత్తం కొంచెం కడితే వచ్చే నెలలో అయినా వెంటనే పూర్తి బిల్లు చెల్లించాలన్నారు.

 

 

అయితే బిల్లు డేట్ మిస్ అయితే ఏకంగా రూ.900 వరకు చార్జీలు పడే అవకాశముందన్నారు. అందువల్ల బిల్లు మొత్తాన్ని ఆటో డెబిట్ ఫెసిలిటీ సెట్ చేసుకోండి అని తెలిపారు. అప్పుడు క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని మరిచిపోయినా కూడా ఆటోమేటిక్‌గానే బిల్లు చెల్లించడం వీలవుతుందన్నారు. మీరు కరెక్ట్ టైమ్‌కు బిల్లులు కట్టకుండా ఉంటే వడ్డీ బాదుడుతోపాటు మరో ఫెసిలిటీ కూడా మిస్ అవుతారని తెలిపారు. కొత్త ట్రాన్సాక్షన్లపై కూడా వడ్డీ రహిత గడువు ఫెసిలిటీ ఉండదని తెలిపారు.

 

 

అయితే రిజర్వు బ్యాంక్ ఇప్పటికే బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఆగస్టు వరకు క్రెడిట్ కార్డు బిల్లు బలవంతంగా కట్టించుకోవద్దని తెలిపారు. అయితే ఇక్కడ మారటోరియం ఫెసిలిటీ ఎంచుకుంటే అంతిమంగా వడ్డీ భారం వినియోగదారుడే భరించాల్సి ఉంటుందన్నారు. అందువల్ల దీనికి దూరంగా ఉండటం మంచిదని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: