ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా గుప్పిట్లో ఉంది. గడిచిన 24 గంటల్లో సరికొత్త రికార్డ్ నమోదైంది. ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 2,12000 పాజిటివ్ కేసులను గుర్తించారు. ఆయా దేశాల గణాంకాల ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ లెక్కలు వెల్లడించింది. వీటిలో 60 శాతం అమెరికా, బ్రెజిల్‌ దేశాల్లోనే నమోదయ్యాయని చెప్పారు. అమెరికాలో 40 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు ఉండగా..బ్రెజిల్‌లో 24,431 కరోనా కేసులు వచ్చాయి. అయితే కరోనాకు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ రాలేదన్న విషయం తెలిసిందే. దాంతో మనం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటేనే రోగాన్ని మన దగ్గరకు రానివ్వకుండా చేయగలం అంటున్నారు వైద్యులు. ఇక గత మూడు నెలల క్రితం ప్రపంచ దేశాల్లో కరోనాని నిర్మూలించేందుకు లాక్ డౌన్ చేపట్టారు.

IHG

ఈ నేపథ్యంలో కొంత మంది తమ స్వస్థలాలు వదిలి సురక్షిత ప్రదేశాలకు వెళ్లారు. సాధారణంగా మనం కూరగాయలు ముఖ్యంగా ఆలుగడ్డలు లాంటి వాటిని వాడకుండా వారం రెండు వారలు ఉంచితే వాటికి మొలకలు రావడం జరుగుతుంది. కొన్ని కుల్లిపోతుంటాయి.. కానీ ఓ మహిళ ఇంట్లో ఆలుగ‌డ్డ‌లు కాస్త మొక్క‌లుగా మారి ఉంటాయి. ఈ మ‌హిళ ఇంట్లో కూడా అదే జ‌రిగింది. ఫ్రాన్స్‌కు చెందిన డ‌న్నా పారీ అనే మ‌హిళ రూ. 210ల‌కు ఆలుగ‌డ్డ‌లు కొని ఇంట్లో పెట్టింది.

IHG

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఆ దేశంలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో డ‌న్నా త‌న ఫ్రెండ్ ఇంటికి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ది. కావాల్సిన వ‌స్తువుల‌న్నీ తీసుకెళ్లింది. ఆ సమయంలో ఆమె తన ఇంట్లో ఆలుగడ్డలు తీసుకు వెళ్లడం మర్చిపోయింది. ఇక లాడ్ డౌన్ ముగిసిన తర్వాత తన ఇంటికి వెళ్లి కిచన్ లో చూడగా.. షాక్‌కు గురైంది. గోడ‌కు మొక్క‌లు మొలిచాయి. మొదట కంగారు పడ్డా.. అవి ఆలుగడ్డ నుంచి వచ్చిన మొలకలని చూసి నవ్వుకుంది. . ఈ మొక్క‌ల‌కు ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇవి బాగా వైర‌ల్ అవుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: