ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటూ సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నారు. న్యాయస్థానాల పై విమర్శల విషయంలో ఒక స్పీకర్ హోదాలో ఆదర్శప్రాయ వ్యక్తిగా కామెంట్లు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇటీవల కోర్టులపై తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిందే. దీంతో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి స్పీకర్ సీతారాం అటువంటి వ్యాఖ్యలు చేయటం ఏంటి అన్నది పెద్ద చర్చగా ప్రారంభమైంది. ఇదే టైములో న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచడానికి వైసీపీ పార్టీ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ని ఉపయోగించుకుంటున్నట్లు మరోపక్క చర్చ కూడా నడుస్తోంది.

IHG

ఇలాంటి తరుణంలో తమ్మినేని సీతారాం తాను ఆదర్శప్రాయమైన వ్యక్తి అని అందుకే అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఇటీవల చెప్పుకొచ్చారు. ఇదే టైమ్ లో రఘురామకృష్ణంరాజు పై కూడా తమ్మినేని వ్యాఖ్యలు చేయడంతో, ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క ప్రభుత్వ వ్యవస్థలపై స్పీకర్ హోదాలో ఉండి కామెంట్లు చేస్తే ఆదర్శప్రాయమైన నాయకుడు ఎలా అవుతాడు..? అతనికి అతను సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ప్రయోజనం ఏముంటుంది అని విపక్ష నేతలు ఆయన చేసిన వ్యాఖ్యల పై మండిపడుతున్నారు.

IHG

అంతేకాకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు గుడ్డలిప్పదీస్తామని ఒకానొక టైంలో వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా మహిళా నాయకురాలు అని చూడకుండా సోనియాగాంధీని కూడా విమర్శించారు. అలాంటి తమ్మినేని తనకి తాను ఆదర్శప్రాయుడు అన్ని సర్టిఫికెట్ ఇచ్చుకోవటం పట్ల చాలా విమర్శలు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా వైసీపీ పార్టీ నాయకులు స్పీకర్ ను అడ్డంపెట్టుకుని న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచే విధంగా చర్యలు చేపట్టడానికి వేస్తున్న వ్యూహాలు అని ఆరోపిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: