నాలుగు రోజుల క్రితం కాన్పూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమై తప్పించుకొని తిరుగుతున్న కరుడు గట్టిన నేరస్థుడు వికాస్ దూబే తల పై వున్న రివార్డును పెంచుతూ యూపీ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. వికాస్ దూబే ఆచూకీ చెపితే తాజాగా 2.5లక్షల రూపాయలు ఇస్తామని యూపీ డీఐజీ ప్రకటించారు. ఇంతకుముందు ఈరివార్డు 50000 ఉండగా ఆతరువాత లక్షకు చేరింది. ఇక ఇప్పుడు ఏకంగా 2.5లక్షలకు పెరిగింది. 
 
మరోవైపు వికాస్ దూబే కోసం పోలీసులు ఉత్తరప్రదేశ్ ను జల్లెడపడుతున్నారు. సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా  పోలీసులు.. వికాస్ దూబే పోటోను చూపించి రోడ్లపై వెళ్తున్నవారిని అడుగుతున్నారు అలాగే టోల్ ప్లాజాల దగ్గర వికాస్ దూబే ఫోటో ను అతికించి కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు అందుకు సంబంధించిన ఫోటోలను కింద వున్న ట్వీట్ లో చూడవచ్చు.
ఇక గురువారం అర్ధరాత్రి తనను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారని ముందే తెలుసుకున్న వికాస్ దూబే.. పోలీసులను ఎదుర్కోవడానికి పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు. తను వున్నఇంటికి వచ్చే దారిలో జేసీబీలు అడ్డుగా పెట్టడంతో పోలీసులు తమకార్లను ఇంటికి దగ్గరలో పార్క్ చేశారు అదే సమయానికి వికాస్ దూబే కరెంటు కూడా తీయించాడు దాంతో చీకట్లో నడుచుకుంటూ లోపలికి వస్తున్న పోలీసుల పై వికాస్ దూబే అతని అనుచరులు కాల్పులు జరిపారు ఈ ఘటనలో 8మంది పోలీసులతో పాటు ఇద్దరు క్రిమినల్స్ కూడా హతమయ్యారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: