ఇటీవల ప్రధాని మోడీ లడక్ ప్రాంతంలో పర్యటించిన మూడు రోజుల తర్వాత గాల్వాన్ లోయ లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ టెంట్లు మరియు వాహనాలు తీసుకుని వెనకడుగు వేశాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు చైనా ఆర్మీ దుకాణం సర్దుకుని వెళ్లిపోయినట్లు భారత్ ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఇదిలాఉండగా భారీ ఎత్తున ఆయుధాలతో ఉన్న చైనా వాహనాలు ఇంకా నదీ తీరంలోనే ఉన్నాయని పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇండియా సమీక్షిస్తోందని చెప్పుకొచ్చారు. గత నెల 15వ తారీకు లడక్ సరిహద్దు ప్రాంతం గాల్వాన్ లోయలో చైనా మరియు భారత్ ఆర్మీ సైనికులు గొడవ పడటం జరిగింది. రెండు దేశాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న తరుణంలో భారత సైనికులు సమర్థవంతంగా చైనా ఆర్మీని ఎదుర్కొని తిప్పి కొట్టడం జరిగింది.

 

జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోవటం అందరికీ తెలిసిందే. దాదాపు 43 సంవత్సరాల తర్వాత చైనాతో ఈ విధంగా సైనికుల ప్రాణాలు పోయే విధంగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మన దేశ ఆర్మీ బలగాలు చైనా సరిహద్దు ప్రాంతంలో భారీగా మోహరించిన తరుణంలోనే చైనా ఆర్మీ కూడా భారీ ఎత్తున యుద్ధ సామాగ్రిని ఆర్మీ బలగాలు బోర్డర్ లోకి  పంపడం జరిగింది. దీంతో కచ్చితంగా చైనా మరియు ఇండియా దేశాల మధ్య యుద్ధం జరగడం గ్యారెంటీ అని అంతర్జాతీయ మీడియా వార్తలు వైరల్ చేసింది.

 

గాల్వాన్ ఘటన తర్వాత సరిహద్దుల విషయంలో కమాండర్ స్థాయిలో మూడుసార్లు చర్చలు జరిగినా చైనా కుయుక్తితో శాంతి జపం పైకి చెబుతూ అంతర్లీనంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం జరిగింది. దీంతో వెంటనే మోడీ ఇటీవల లడక్ సరిహద్దు ప్రాంతంలో పర్యటించి సైనికులతో మాట్లాడటంతో చైనా దెబ్బకి వెనకడుగు వేసినట్లు సమాచారం. అంతేకాకుండా మోడీ పర్యటన తర్వాత సమస్యను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ తరుణంలో ఏ ఒక్కరూ రెచ్చగొట్టేలా వ్యవహరించకూడదని ప్రధాని పర్యటనను ఉద్దేశించి చైనా వ్యాఖ్యానించింది.  ఆ తర్వాత ఇటీవల చైనా బలగాలు అతిక్రమణ చేసిన చోటు నుండి వెనక్కి వెళ్లిపోవడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: