కరోనా కష్టకాలంలో ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి ప్రజలకు ధైర్యం చెబుతూ ప్రభుత్వ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ కేసీఆర్ వ్యవహరించిన తీరు ప్రశంసలు కురిపిస్తూ వచ్చాయి. ఆ తర్వాత కరోనా పాజిటివ్ కేసులు ఆయన తక్కువ చేసి చూపిస్తున్నారని, పరీక్షలు నిర్వహించడంలో అలక్ష్యం వహిస్తున్నారని, పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. కోర్టులు కూడా ఈ విషయాన్ని తప్పు పట్టాయి. ఆ తర్వాత కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించడం తో తెలంగాణ వ్యాప్తంగా రోజురోజుకు తీవ్రస్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసులు ఆందోళనకరమైన రీతిలో బయటపడుతున్నాయి. అక్కడ కరోనా ప్రభావానికి గురవ్వని వీధి ఒక్కటి కూడా లేదంటే, అక్కడ ఎంత తీవ్రంగా ప్రభావం ఉందో చెప్పనవసరం లేదు. ఈ సమయంలో నగరంలో లాక్ డౌన్ విధిస్తారనే  ప్రచారం చోటు చేసుకుంది.

IHG

కరోనా కేసులతో ఇప్పుడు ఆస్పత్రులను కిక్కిరిసి పోతున్నాయి. ఎక్కడ చూసినా పాజిటివ్ పేషెంట్ల తోనే హాస్పిటల్ దగ్గర హడావుడి కనిపిస్తోంది. పదిహేను వందల పడకలతో టీమ్స్ ఆసుపత్రిని రెడీ చేసిన ఇప్పటివరకు అది అందుబాటులోకి రాలేదు. ఇక మిగతా ఆస్పత్రుల్లోనూ, కరోనా పేషెంట్లకు చికిత్స చేసేందుకు అవకాశం దొరకడం లేదు. ఇప్పటికే చాలా మంది జర్నలిస్టులు దీని ప్రభావానికి గురవడంతో, వారికోసం ప్రత్యేకంగా నేచర్ క్యూర్ ఆసుపత్రి లో ఏర్పాటు చేసి నా, వారికి కూడా పెద్దగా అక్కడ అ అవకాశం దొరకడం లేదు. కేవలం సిఫార్సులు ఉన్నవారికి మాత్రమే అక్కడ దొరికే పరిస్థితి ఉంది అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

ఇదిలా ఉంటే ప్రస్తుతం వాతావరణం మారడంతో సీజనల్ వ్యాధులు కూడా మొదలయ్యాయి. కరోనా సోకిన వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉండమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.అంతేతప్ప ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో భరోసా లభించడం లేదు.దీంతో ప్రజల్లో మరింత ఆందోళన పెరిగిపోతుంది. ఈ సమయంలో ప్రజలకు ధైర్యం చెబుతూ ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హస్ కు పరిమితమై పోవడంతో, పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రగతిభవన్ లో 30కిపైగా పాజిటివ్ కేసులు బయటపడడంతో, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే అన్ని వ్యవహారాలు నడిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై పెద్ద ఎత్తున విపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి.ఒక దశలో కేసీఆర్ కూడా కరోనా సోకిందని ప్రచారం జరిగినా, ప్రభుత్వ వర్గాలు, పార్టీ వర్గాలు కొట్టిపారేశాయి. అంతేకాకుండా ఈ ప్రచారాన్ని మొదలు పెట్టిన వారిపై కేసులు కూడా ఇప్పుడు నమోదు చేస్తున్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నా, ఆయన అక్కడి నుంచే మొత్తం అన్ని వ్యవహారాలను పర్యవేక్షించి, ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇస్తున్నారని టిఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: