టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ ఉనికి కాపాడుకోవటం కోసం అనేక తిప్పలు పడుతున్నారని సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత పార్టీ నుంచి చాలామంది నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లిపోవడం. అదే విధంగా ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలు వరుసగా అరెస్టులు కావటంతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు అంట. ముఖ్యంగా మంచి దూకుడు మీద ఉన్న వైయస్ జగన్ ని కట్టడి చేయాలని వ్యూహాలు వేస్తున్నారట. దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఏదోవిధంగా దగ్గరవటానికి అనేక దారులు వెతుకుతున్నారు అట. ఇటువంటి తరుణంలో తన హయాంలో అమరావతి రాజధానిగా చేసిన టైములో ఢిల్లీ కంటే అద్భుతమైన రాజధాని ఏపీలో కట్టించడానికి పూర్తిగా సహకారం ఇస్తామని చెప్పిన మోడీని లైన్ లో పెట్టడానికి బాబు ప్రయత్నాలు చేస్తున్నారట.

 

ఈ నేపథ్యంలో ఇటీవల అమరావతి ప్రాంత రాజధాని రైతులు 29 గ్రామాల ప్రజలు అమరావతిని మాత్రమే రాజధానిగా ఉంచాలని చేస్తున్న ఆందోళనలు నిరసన కార్యక్రమం 200కు చేరిన టైంలో చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఇదే సమయంలో గతంలో అమరావతి ప్రాంతంలో మోడీ పర్యటించిన సందర్భంలో ఆయన ప్రసంగాన్ని తాజాగా చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతిని కాపాడాలని ఆ బాధ్యత కేంద్రం ప్రభుత్వంపైనే ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ టైములో అదే విధంగా కొన్ని సందర్భాలలో జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తూ కేంద్రానికి దగ్గర అవుదామని చంద్రబాబు ప్రయత్నించడం జరిగింది. అవి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. 

 

ఇటువంటి తరుణంలో అమరావతి ఫార్ములాను ఉపయోగిస్తూ అప్పటి మోడీ పర్యటనను గుర్తు చేస్తూ చంద్రబాబు మరోసారి కేంద్రానికి క్లోజ్ అవ్వడానికి తాజాగా రాజధాని రైతులు చేస్తున్న దీక్షను అడ్డం పెట్టుకుంటున్నారని మేధావులు అంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల టైంలో మోడీ తల్లిని మరియు భార్యని చంద్రబాబు విమర్శించడం జరిగింది. ఆ తరువాత జరిగిన ఎన్నికలలో బాబు ఓడిపోవడం మరొక పక్క కేంద్రంలో మోడీ భారీ మెజార్టీతో గెలవడం తో చంద్రబాబు వేసిన వ్యూహాలు మొత్తం తలకిందులయ్యాయి. ఇలాంటి తరుణంలో చంద్రబాబు కేంద్రానికి దగ్గరవడానికి అనేక ప్రయత్నాలు చేసినా ఏది పెద్ద సక్సెస్ కాకపోవడంతో, ఈ సారి వాడిన అమరావతి ఫార్ములా సక్సెస్ అవుతుందో లేదో అన్న టెన్షన్ టీడీపీలో నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: