దేశంలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో ఊహించని విధంగా కేరళ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన కరోనా నిబంధనలు భౌతిక దూరం, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం అదే విధంగా సామూహిక సమావేశాలు రద్దు వంటి నిబంధనలు వచ్చే ఏడాది జూలై వరకు ఈ నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా కేరళ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కేరళ ప్రభుత్వం ఆదేశించిన కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి … పెళ్లిళ్లకు యాభై మంది మించి ఉండకూడదని సూచించింది.

 

అదే టైంలో అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరు కాకూడదని బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ ముక్కు, నోరు కవర్ అయ్యేలా ఫేస్ మాస్క్ ధరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ప్రయాణాల్లో మార్పులు తప్పనిసరి గా ధరించాలని సోషల్ డిస్టెన్స్ విషయంలో వ్యక్తికి వ్యక్తికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలి అని తెలిపింది. శుభ కార్యాలు మరియు ఇతర వేడుకల విషయంలో నిర్వాహకులు అతిథులకు తప్పనిసరిగా శానిటైజర్ చెయ్యాలని చెప్పుకొచ్చింది. ఇంకా ఊరేగింపులు ధర్నాలు మరియు సదస్సులు, గెట్ టు గెదర్ వంటి కార్యక్రమాలకు జిల్లా అధికారుల అనుమతి ఉండాలని తెలిపింది.

 

అనుమతి వచ్చిన గాని పది మందికి మించి హాజరు కాకూడదని సూచించింది. అలాంటి కార్యక్రమంలో కూడా తప్పనిసరిగా ముఖానికి మాస్క్, సోషల్ డిస్టెన్స్ శానిటైజర్ తప్పనిసరి అని కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. అంతే కాకుండా పెద్ద సూపర్ మార్కెట్ లో ఒకేసారి 20 మందికి మించి కస్టమర్లను అనుమతించకూడదని తెలిపింది. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో రోడ్డుపై ఫుట్‌పాత్‌లపై ఉమ్మి వేయకూడదని తెలిపింది. ఈ రూల్స్ మొత్తం వచ్చే ఏడాది జూలై వరకు కేరళలో అమలు చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: