భారత్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 24,248 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది. అదే సమయంలో 425 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసుల విషయంలో భారతదేశం రష్యాను అధిగమించి, టాప్-3 స్థానంలోకి చేరుకుంది.  మన దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 6,97,413 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 19,693కి పెరిగింది. 2,53,287 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 4,24,433 మంది కోలుకున్నారు. 

IHG

తాజాగా  దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ల సంఖ్య లక్ష దాటినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ.. ఢిల్లీలో కోవిడ్ -19 కేసులు లక్ష దాటాయి. కానీ ఇందులో 72,000 మంది ప్రజలు కోలుకున్నందున భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతేగాక ‘25 వేల యాక్టివ్‌ కేసులో 15 వేల మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. ఇక మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గిందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కరోనా బాధితుల్లో అతి తక్కువమందికి మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స అందించాల్సిన అవసరం ఉంది.

IHG

కొన్నిరోజులుగా చాలా మంది ఇంటివద్దనే కోలుకుంటున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.  దేశంలోనే మొట్టమొదటి కరోనా ప్లాస్మా బ్యాంకును మా ప్రభుత్వమే ప్రారంభించింది. ఇది మంచి ఫలితాలనిస్తుంది. ఈ ప్లాస్మా థెరపీతో స్వల్ఫ కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారి ఆరోగ్యం గణణీయంగా మెరుగుపడుతోంది ఆయన అన్నారు. డిల్లీ ఆస్పత్రుల్లో‌ చేరే వారి సంఖ్య తగ్గుముఖం పడుతోందని, కోలుకుం టున్న వారి సంఖ్య పెరుగుతుందన్నారు. చాలా మంది ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటూ కోలుకుంటున్నారని ఆయన చెప్పారు.  ప్రస్తుతం రక్తదానం చేసేవారి కంటే అవసరమైన వారి సంఖ్య అధికంగా ఉందని, అర్హులైన వారందరూ ముందుకు వచ్చి రక్త దానం చేయాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: