ఈ మద్య తెరపైకి ఎన్నో ఎనుగుల దీనగాధలు వెలుగులోకి వచ్చాయి. కేరళాలో ఓ గర్భంతో ఉన్న ఏనుగు బాంబు తిని పేలి పద్నాలు రోజులు నరకం అనుభవించి చనిపోయింది. అయితే ఇది మానవ తప్పిదం వల్ల జరిగిందే.. అన్యాయంగా గర్భంతో ఉన్న ఏనుగును పొట్టన బెట్టుకున్నారని దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత పలు చోట్ల ఏనుగులు చనిపోయిన కేసులు వెలుగు లోకి వచ్చాయి. సాధారణంగా ఏనుగులు అంత పెద్ద ఆకారంతో ఉన్నా మావటి వాడి మాటలు ఎంచక్కా వింటుంటాయి. ఎక్కువగా కేరళా, తమిళనాడులో ఏనుగులు మనుషులతో సన్నిహతంగా ఉంటుంటాయి.

IHG'bob ...

తాజాగా తమిళనాడు రాష్ట్రం హైందవ దేవాలయాలకు పెట్టిందిపేరు. అక్కడున్న చాలా ఆలయాల్లో ఆస్థాన కైంకర్యాల నిమిత్తం ఏనుగులను పోషిస్తుంటారు. అయితే, అన్ని ఏనుగులు ఒకెత్తయితే మన్నార్ గుడిలోని రాజగోపాలస్వామి ఆలయంలో ఉన్న 'సెంగమాలమ్' అనే ఏనుగు ఎంతో పాపులారిటీ సంపాదించింది. అదేంటే ఆ ఏనుగు కి అంత ప్రత్యేకత ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా.. ఉంది కనుకనే అది అంత పాపులర్ అయ్యింది. ఇతర ఏనుగులకు భిన్నంగా 'సెంగమాలమ్' చక్కని హెయిర్ స్టయిల్ తో దర్శనమిస్తుంది.

 

అది కూడా బాబ్డ్ కట్ తో..  తన ముఖానికి సరిపోయే క్రాఫింగుతో ఆ ఏనుగు అందం చూడాల్సిందే. 'సెంగమాలమ్' స్వస్థలం కేరళ. అయితే 2003లో దాన్ని మన్నార్ గుడి రాజగోపాలస్వామి ఆలయానికి తీసుకువచ్చారు. దీని మావటి రాజగోపాల్ దీనికి ప్రత్యేకమైన క్రాఫ్ చేసి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాడు.  ఏది ఏమైనా  'సెంగమాలమ్’ కి సోషల్ మీడియాలో తెగ క్రేజ్ వచ్చిపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: