దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 6,97,413 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 19,693కి పెరిగింది. 2,53,287 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,24,433 మంది కోలుకున్నారు. నిన్నటి వరకు దేశంలో మొత్తం 99,69,662 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 1,80,596 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.  ఇటీవల లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కేసులు విపరీతంగా పెరిగిపోతూ వచ్చాయి.  కరోనా వచ్చినప్పటి నుంచి పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఎనలేని సేవలు చేస్తున్నారు.

 

ఈ మద్య డాక్టర్లు, పోలీసులు ఈ కరోనా కాటుకు బలి అవుతున్నారు. చాలా మంది పోలీసులు భద్రతా చర్యలు చేపడుతుండడంతో పాటు పోలీస్‌స్టేషన్లను కూడా శుభ్ర పరిచి ప్రతిరోజు శానిటైజేషన్‌ చేయిస్తున్నారు. అయితే చండీఘర్‌లోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ను రెండు రోజుల పాటు మూసివేసి శానిటైజేషన్‌ చేయనున్నట్లు  ఎస్పీ మనోజ్‌కుమార్‌ సోమవారం తెలిపారు.ఈ మద్య కాలంలో వివిధ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా కేసులతో పోలీసులు మరణించిన విషయం తెలిసిందే.

 

అందుకు ఎప్పటికప్పుడు శానిటైజర్ చేస్తూ తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ఆయన తెలిపారు.  విద్యాశాఖ కార్యాలయంలో ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ  కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. చండీఘర్‌లోని సెక్టార్‌9లో విద్యాశాఖ, పోలీస్‌హెడ్‌ క్వార్టర్స్‌ కార్యాలయాలు  ఒకదానికొకటి పక్కపక్కనే ఉండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రెండు రోజుల పాటు శానిటైజేషన్‌ చేయించనున్నట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు మాస్కులు, సోషల్ డిస్టెన్స్ తో ఉండాలని ఆయన ప్రజలకు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: