ఒకప్పుడు చైనా అంటే తక్కువ ధరకు, నాణ్యత లేని వస్తువులు దొరుకుతాయని గుర్తొచ్చేది. కానీ ప్రస్తుతం చైనా అంటే మాత్రం వైరస్ లే గుర్తుకు వస్తున్నాయి. చైనా సృష్టిస్తోందో లేక అక్కడి జంతువుల నుంచి వ్యాప్తి చెందిందో కచ్చితంగా చెప్పలేము కానీ ఇప్పటికే కరోనా వైరస్ ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తోంది. ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలన్నీ అల్లాడుతున్నాయి. ఈ వైరస్ ల వల్ల ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. 
 
అయితే ఈ వైరస్ విజృంభణకు తాము కారణం కాదని అది ఎలా వ్యాప్తి చెందిందో తెలియదని చైనా చెబుతోంది. వైరస్ ను ఏ విధంగా నియంత్రించిందో కూడా చైనా చెప్పటం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి పైగా ఈ వైరస్ భారీన పడ్డారు. రెండు రోజుల క్రితం పందుల నుంచి జీ4 వైరస్ మనుషులకు సోకుతున్నట్లు ఈ వైరస్ ల భారీన పడిన వాళ్లు చనిపోతున్నట్లు తేలింది. అయితే ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాపించదని చైనా చెబుతోంది. 
 
అయితే జీ4 వైరస్ ప్రాణాంతకమే అని చైనా చెబుతోంది. తాజాగా మర్మోట్ జాతికి చెందిన ఎలుకల నుంచి కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ ఎలుకల నుంచి బుటోనిక్ ప్లేగు ఉత్తరచైనా అంతటా వ్యాప్తి చెందింది. జ్వరం, తలనొప్పి, వాపులు ఈ వ్యాధి లక్షణాలు. ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది. చైనా ప్రజలు జంతువులను తినడం వల్లే వైరస్ లు వ్యాప్తి చెందుతున్నాయి. 
 
చైనాలో వెలుగులోకి వస్తున్న కొత్త వైరస్ లు ఆ దేశం యొక్క ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. వైరస్ ల వల్ల ప్రపంచ దేశాలు గజగజా వణికిపోతున్నాయి. చైనాపై పలు దేశాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. మరోవైపు భారత్ చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆ దేశానికి నెగిటివ్ గా మారాయి. చైనా త్వరలో ఏకాకి దేశమైనా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతునాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: