ఏపీ సీఎం జగన్ రేపు కడప వెళ్తున్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారు. ఎల్లుండి వైఎస్ జయంతి సందర్భంగా.. ఇడుపుల పాయలో ఆయన సమాధి దగ్గర నివాళులు అర్పిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. 

 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి రెండు రోజుల పాటు సొంత జిల్లా కడపలో పర్యటిస్తారు. మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో కడపకు , అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఇడుపుల పాయకు చేరుకుంటారు. 

 

బుధవారం ఇడుపుల పాయలోని వైఎస్‌ఆర్‌ ఘాటు వద్దకు చేరుకొని నివాళులు అర్పిస్తారు. తర్వాత రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన, అకడమిక్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు.  

 

బుధవారం ఇంటి పట్టాల పంపిణీ, రైతు దినోత్సవం తదితర కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి పులివెందుల చిరు వ్యాపారాలకు ఆర్థిక భరోసా కల్పించే జగనన్న తోడు పథకాన్ని అక్టోబరులో ప్రభుత్వం ప్రారంభించనుంది. చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వారికి, సంప్రదాయ వృత్తులు చేసే హస్త కళాకారులకు ఈ పథకం కింద 10వేల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తారు. 

 

అర్హుల గుర్తింపు కోసం ఈ నెల 6 నుంచి 13 వరకు వాలంటీర్లు సర్వే నిర్వహిస్తారు. 16వ తేదీ నుంచి 23 వరకు సామాజిక తనిఖీ నిమిత్తం సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శిస్తారు.

 

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా కాలం తర్వాత కడపలో అడుగుపెట్టనుండటంతో అక్కడి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిని తనివితీరా చూసేందుకు ఎంతో ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: