రక్షణ కల్పించే శాఖలో విచ్చలవిడిగా ముగ్గురు కానిస్టేబుళ్లు మద్యం సేవించిన వీడియో బయటకు రాగా, వారిపై అధికారులు క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. ఈ ఘటన  జిల్లాలోని హిందూపురం టౌన్‌ స్టేషన్‌లో జరిగింది.  మద్యం, ఇసుక, మత్తు పదార్థాల అక్రమ రవాణాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఈ ఘటన పై జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు సీరియస్ గా పరిగణించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు సిబ్బందిపై వేటు వేశారు. హిందూపురం టూటౌన్ హెడ్ కానిస్టేబుళ్లు తిరుమలేష్ , నూర్ మహమ్మద్ , కానిస్టేబుల్  గోపాల్ నాయక్ లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

 

ప్రస్తుతం ఏపిలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు తమ విధులు ఎంతో గొప్పగి నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి పనుల వల్ల తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు సీరియస్ అయ్యారు.   ఈ ముగ్గురు కూడా హిందూపురం టూటౌన్ లో పని చేస్తున్నారు.

 

తిరుమలేష్ , నూర్ మహమ్మద్ ల కుటుంబాలు అనంతపురంలో ఉంటున్నాయి. గోపాల్ నాయక్ అవివాహితుడు. దీంతో ఈ ముగ్గురు డ్యూటీకి వచ్చిన సదర్భాలలో టూటౌన్ పోలీసు స్టేషన్ పైభాగంలో ఉన్న రెస్ట్ రూంలో బస చేసేవారు. ఈక్రమంలో ఈ ముగ్గురు కలసి రెస్ట్ రూంలో ఉన్న సమయంలో మద్యం సేవించారు. ఈఘటనపై ప్రాథమిక విచారన జరిపించి ఈ ముగ్గుర్ని సస్పెండ్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: