పాక్ ఆక్రమిత కశ్మీర్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశానికి సంబంధించిన వెబ్ సైట్లు, డైరెక్ట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ లో ఆజాదీ ఫ్రమ్ పాకిస్తాన్ కావాలని వాళ్లు కోరుతున్నారు. పాకిస్తాన్ నుంచి తమకు స్వాతంత్రం కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. 70 ఏళ్ల నుంచి పాక్ అరాచకాలతో తాము అన్యాయం అయిపోతున్నామని..... కనీస హక్కులు, వసతులు కోల్పోయామని వాళ్లు చెబుతున్నారు. 
 
భద్రత లేని బ్రతుకులు జీవిస్తున్నామని.... అధికారిక వెబ్ సైట్లోనే తమకు స్వతంత్రం కావాలని పీవోకే ప్రజలు కోరుకోవడం గమనార్హం. పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగాన్ని భారత్ లో కలిపి ఇక్కడ ప్రజలు ఏ విధంగా జీవనం సాగిస్తున్నారో అదే విధంగా జీవిద్దామని పీవోకే ప్రజలు భావిస్తున్నారు. కశ్మీర్ ను భారత్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ఉండటంతో అదే తరహా అభివృద్ధిని పీవోకే కోరుకుంటోంది. 
 
భారత్ కశ్మీర్ ను సర్వజనామోద్యంగా తయారు చేస్తూ ఉండటంతో అక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడుతున్నాయి. కశ్మీర్ ప్రాంతంలో భూమి విలువ కూడా గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. కశ్మీర్ లోని ప్రజలకు పీవోకేలొని ప్రజలు బంధువులు అవుతారు. పాకిస్తాన్ తో ఉంటే మరో 70 సంవత్సరాల తర్వాత కూడా తమ పరిస్థితి మారదని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. పాక్ సైన్యానికి రక్షణగా నిలవాల్సి వస్తుంది. 
 
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు ప్రాణాలను కోల్పొతున్నారు. వీళ్లను ఉపయోగించుకుని పాక్ సైన్యం, ఉగ్రవాదులు తల దాచుకుంటున్నారు. ఎవరైనా ప్రణాలు కోల్పోతే ప్రభుత్వం పరిహారం కూడా ప్రకటించకపోవడంతో అక్కడి ప్రజలు రోడ్డున పడుతున్నారు. ప్రత్యేక కశ్మీర్ గా కాకుండా భారత్ లో చేర్చాలని వాళ్లు కోరుతూ ఉండటంతో ఈ పరిణామాలు ఎన్ని మలుపులు తీసుకుంటాయో చూడాల్సి ఉంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: