చంద్రబాబు పూర్తిగా ఏపీకి పరిమితమైపోయారు. అది కూడా అమరావతికే నాయకుడు  అయిపోయారనిపిస్తోంది. లేకపోతే ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అయిన బాబు, జాతీయ స్థాయిలో వెలుగు వెలిగిన బాబు ఇపుడున్న పరిస్థితుల్లో సీనియర్ గా ప్రజల కోసం గొంతు ఎత్తాల్సిన బాధ్యత లేదా అని అంతా అంటున్నారు.

 

మోడీ చేతులెత్తేశారు, కరోనా కట్టడి విషయంలో అట్టర్ ఫ్లాప్ అని ఓ వైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అంటూంటే బాబు మాత్రం  అతి చిన్న పార్టీ నాయకుడి మాదిరిగా జగన్ మీద పడిపోతున్నారు. మాట్లాడితే ఏపీలో ఫెయిల్ అంటున్నారు. దేశమే ఫెయిల్  అయింది బాబూ అంటున్నారు రాహుల్. అందులో అతి చిన్న రాష్ట్రం ఆంధ్రా హిట్ అయినా ఫెయిల్ అయినట్లే కదా. ఎందుకంటే దేశమంతా లాక్ డౌన్ ఉంటే, కట్టు దిట్టంగా ఉంటే కదా ఏపీలో కూడా ఆ ప్రభావం పడేది.

 

మరి బాబు మాత్రం వింతగా మాట్లాడుతున్నారు. జగన్ దే తప్పు అంటున్నారు. నిజానికి దేశంలో సవ్యంగా కరోనా కట్టడికి చర్యలు తీసుకోలేదు అని రాహుల్  అంటున్నారు. ఇక బాబు ఉన్న తెలంగాణా స్టేట్ లో  తీసుకుంటే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ సీఎం కేసీయార్ని వేరీజ్ సీఎం అని అడుగుతున్నారు.

 

మరి బాబులోని జాతీయ నాయకుడికి ఇవన్నీ కనిపించడంలేదా  అని ప్రశ్నిస్తున్నారు. ఎంతసేపూ ఏపీ మీదనే నిందలు వేస్తూ తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని వైసీపె నేతలు విమర్శలు చేస్తున్నారు. మరి బాబు జాతీయ పార్టీకి ప్రెసిడెంట్ ని అని చెప్పుకోవడం ఎందుకోనని కూడా అడుగుతున్నారు. దీనికి బాబు జవాబు చెప్పగలరా.

 

ఇక దేశంలోనే అధికంగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉంది. ఆ విషయంలో అంతా మెచ్చుకుంటూంటే టెస్టులు మాయ అని అందులో కూడా కుంభకోణం ఉందని బాబు అంటున్నారంటే అది ఫక్త్ రాజకీయమేనని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: