జూన్ 15వ తారీకు భారత్-చైనా సరిహద్దు ప్రాంతం లడక్ దగ్గర గాల్వాన్ లోయలో భారత్ ఆర్మీ కి మరియు చైనా ఆర్మీ కి గొడవ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. డ్రాగన్ దేశానికి చెందిన సైనికులు కావాలని భారత్ ఆర్మీ ని రెచ్చగొట్టడానికి అక్రమంగా భారత భూభాగంలోకి అడుగుపెట్టడంతో ఈ గొడవ చోటు చేసుకుంది. జరిగిన ఈ ఘటనలో ఇరు దేశాలకు చెందిన సైనికులు ఆయుధాలు ఏమీ లేకుండా ఒకరితో ఒకరు తల పడటం జరిగింది. జరిగిన ఈ ఘటనలో భారత్ ఆర్మీ కి చెందిన 20 మంది జవాన్లు ప్రాణాలు పోగొట్టుకున్నా విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా కొంత మంది గాయపడ్డారు కూడా. ఇదే టైములో భారత జవాన్లు కూడా చైనా ఆర్మీ కి ధీటు గానే సమాధానం చెప్పడం జరిగింది.

 

ఆ సమయంలో చైనా ఆర్మీకి చెందిన సైనికులు కూడా భారీ స్థాయిలో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ చైనా దేశం నలుగురు, ముగ్గురు తప్ప ఎవరూ చనిపోలేదు అన్నట్టు వ్యాఖ్యలు చేశాయి. కానీ కరెక్ట్ లెక్క ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇటువంటి తరుణంలో గాల్వాన్ లోయలో జరిగిన దాడిలో ఇండియన్ ఆర్మీ చేతిలో డ్రాగన్ దేశానికి చెందిన సైనికులు దాదాపు 100 మంది చనిపోయినట్లు ఆ దేశ మాజీ సైనికాధికారి జినాలి యాంగ్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఇండియన్ ఇంటెలిజెన్స్ కూడా తెలపడం జరిగింది. కానీ ఆ టైంలో చైనా దేశం ఇండియన్ ఇంటిలిజెన్స్ బయటపెట్టిన లెక్కల్లో వాస్తవం లేదని పేర్కొంది.

 

కాగా ఇప్పుడు ఆ దేశానికి చెందిన మాజీ సైనికాధికారి తెలపడంతో ఈ వార్త అంతర్జాతీయ స్థాయిలో వైరల్ గా మారింది. నిజంగా యుద్ధం జరిగి ఉంటే చైనా దేశంలో చాలా మంది సైనికులు చంపే సత్త ఇండియాకి ఉందని మొన్నటి వరకు చైనా పవర్ ఫుల్ కంట్రీ అన్న దేశాలు లెక్క విని ఈ వ్యాఖ్యలు చేస్తున్నాయట. మామూలుగానే ఒక్క ఇండియన్ ఆర్మీ సోల్జర్ చైనా దేశానికి చెందిన నలుగురు సైనికులకు సమానమని ప్రపంచంలో ఓ టాక్ ఉంది. దీంతో ఇంత మంది చైనా దేశానికి చెందిన సైనికులు చనిపోవటం వార్త విని చాలా దేశాలు..ఇండియన్ ఆర్మీ సత్తా తెలుసుకుని తెగ పొగుడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: