వైఎస్ జగన్ సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారు. తాను ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ త్వర త్వరగా అమలు చేస్తున్నారు. ఇందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా పెద్దగా పట్టించుకోవడం లేదు. నవరత్నాలతో పాటు సంక్షేమ పథకాల అమలుకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించిన జగన్.. ఇళ్ల స్థలాల పేరుతో గతంలో ఏ సీఎం చేయలేని బృహత్తర కార్యక్రమం చేయబోతున్నారు. 

 


ఏకంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నారు. అయితే ఈ కార్యక్రమంపై ప్రతిపక్ష తెలుగుదేశం కుట్రలు చేస్తోందట. ఈ కార్యక్రమం సజావుగా సాగితే వైసీపీకి ఎక్కడ పేరు వస్తుందోనని పన్నాగాలు పన్నుతోందట. అందుకే.. ప్రతిపక్షాలు కోర్టులను అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నాయని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శిస్తున్నారు. అందుకే ఇళ్ల స్థలాల పంపిణీ కాస్త ఆలస్యం కావచ్చని బొత్స అంటున్నారు. 

 


పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నాలు చేస్తుంటే, తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రతిదానికి కోర్టులకు వెళ్లి స్టేలు తేవడం ద్వారా టిడిపి కుట్రలు చేస్తోందని మంత్రి బొత్స  అంటున్నారు. తాత్కాలికంగా ఈ కుట్రల వల్ల స్థలాల పంపిణీ కొంత ఆలస్యం అవుతుందేమో కానీ.. పేదలకు స్తలాలు ఇవ్వకుండా టిడిపి ఆపలేదని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు. 

 


ఆనాడు దివంగత మహానేత వైయ‌స్ఆర్ ‌ ప్రతి పేదవారికి ఇళ్లను అందిస్తే.. అదే స్ఫూర్తితో నేడు ఆయన తనయుడు సీఎం వైయ‌స్‌ జగన్‌ పేదలకు ఇళ్ల స్థలాలను అందించేందుకు సిద్ధమయ్యారని మంత్రి బొత్స  పేర్కొన్నారు. మొదట 25 లక్షలు అనుకున్నామనీ.. 30 లక్షలు పేదలకు ఇళ్ళు స్థలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సిద్ధమయ్యార‌ని మంత్రి బొత్స వివరించారు. కోర్టులు నుంచి స్టే  తీసుకు వచ్చి టీడీపీ కుట్రలు చేస్తోందని మంత్రి బొత్స మండిప‌డ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: