ఒక్కోసారి ఊహించని వక్తుల నుంచి అనూహ్యంగా మద్దతు , ప్రశంసలు లభిస్తే ఆ కిక్కే వేరు. అందులోనూ రాజకీయ ప్రత్యర్థి పార్టీల నుంచి మద్దతు లభిస్తే  అంతకంటే గొప్పతనం ఏముంటుంది ? ఇప్పుడు అటువంటి గొప్పతనాన్ని సాధించారు ఏపీ సీఎం జగన్. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి జగన్ పూర్తిగా ప్రజా సంక్షేమ విషయాలపై దృష్టి పెట్టారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి చూపిస్తున్నారు. ప్రస్తుతం కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నాి, సంక్షేమ పథకాలు జగన్ అమలు చేసి చూపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా, కొత్తగా మరికొన్ని సంక్షేమ పథకాలను తీసుకువచ్చి దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడమే కాకుండా, ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. దివంగత రాజశేఖరరెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. 

 
 
అప్పట్లో ఓదార్పు యాత్ర చేపట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోకపోయినా, జగన్ ముందడుగు వేయడం తో ఆ పార్టీ ఆగ్రహానికి గురయ్యారు ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టారు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఉప్పు నిప్పులా గా ఉంటూ వస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ సీఎం జగన్ ను పొగడ్తల వర్షం కురిపించారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఆ వ్యాధి బారిన పడిన వారిని ఆదుకునేందుకు, పేద ప్రజలకు వైద్య సహాయం అందించే నిమిత్తం 108, 104 వాహనాలను ఈ క్లిష్ట సమయంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వం పై సిద్దిరామయ్య విమర్శలు చేశారు. 
 
IHG
 
ఆంధ్ర సీఎం జగన్ ను చూసి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప చాలా నేర్చుకోవాలని, 203 కోట్ల వ్యయంతో 1088 అంబులెన్సులను అందుబాటులోకి ఈ క్లిష్ట సమయంలో  తీసుకొచ్చిన ఘనత జగన్ కు దక్కుతుందని సిద్ధరామయ్య ప్రశంసించారు. కర్ణాటక రోడ్లు పై  పాడుబడిన అంబులెన్సు సంచరిస్తున్నాయి అని సిద్దరామయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని ఉద్దేశించి కూడా ఆయన విమర్శలు చేశారు. 
 
 
సిద్ధరామయ్య ఈ విధంగా జగన్ పై ఈ విధంగా పొగడ్తల వర్షం కురిపించడం పై కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇదే విషయం పై జగన్ ను ప్రశంసించడం, కరోనా టెస్ట్ లు చేసే విషయంలోనూ జగన్ సమర్థవంతంంగా పని చేస్తున్నారు అని ప్రశంసించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: