వాడో యువ‌కుడు. వ‌య‌సు 28 ఏళ్లు. చెత్త ఆలోచ‌న‌తో ఓ ఆడ‌బిడ్డ‌ను చెరిచాడు. అంతేకాకుండా 60 మందిని క్వారంటైన్లోకి పంపించాడు. క‌రోనా వైర‌స్ అంటేనే అంద‌రూ హ‌డ‌లిపోతున్న త‌రుణంలో ఓ దుర్మార్గుడి ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టాడు. ఓ అత్యాచారం కేసులో మైసూర్ కు చెందిన 28 ఏళ్ల యువ‌కుడిని చ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీసులు అరెస్టు చేయ‌గా వారికి ఈ ఊహించ‌ని షాక్ త‌గిలింది. వాడిని అరెస్టు చేసిన పోలీసు స్టేష‌న్ లో విధులు నిర్వ‌ర్తించిన 60 మంది పోలీసులు క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

 

బాబా అటామిక్ రీసెర్చ్ సెంట‌ర్(మైసూరు యూనిట్)లో ప‌ని చేస్తున్న ఆ నిందితుడు త‌న‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడ‌ని గ‌త నెల‌లో ఓ మ‌హిళ ఫిర్యాదు మేర‌కు పోలీసులు..ఆ యువ‌కుడిని జులై 4న అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన అనంత‌రం నిందితుడిని జైలుకు త‌ర‌లించారు. అక్క‌డ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో సివిల్ లైన్స్ పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో.. 60 మంది పోలీసులు హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. పోలీసులంద‌రి న‌మూనాల‌ను వైద్యులు సేక‌రించారు. రేపోమాపో వారి ఫ‌లితాలు రానున్నాయి. అయితే, ఆ పాపాత్ముడు చేసిన ప‌నికి ఆడ‌బిడ్డ‌తో పాటుగా తాము సైతం న‌ర‌కం అనుభ‌వించాల్సి వ‌స్తోంది పోలీసులు ఆవేద‌న చెందుతున్నారు. 

 


ఇదిలాఉండ‌గా, గ‌త నెల‌లోనూ ఓ విస్మ‌య‌క‌ర అత్యాచార ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. లైంగికదాడి కేసులో నిందితుడైన ఐఏఎస్‌ అధికారి జనక్‌ ప్రసాద్‌ పాఠక్‌ను ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బాఘేల్‌ సస్పెండ్‌ చేశారు. జన్‌గిర్‌- చంపా కలెక్టర్‌గా పనిచేసిన జనక్ ఓ 
త‌న‌పై కలెక్టరేట్‌లోనే లైంగిక దాడి చేశారని అదే జిల్లా మహిళ (33) పోలీసులకు ఫిర్యాదుచేశారు. అసభ్యకర మెసేజ్‌లు పంపారని సంబంధిత స్క్రీన్‌షాట్లు అందజేశారు.  త‌న మాట విన‌క‌పోతే ప్రభుత్వోద్యోగి అయిన తన భర్తను తొలిగిస్తానని హెచ్చ‌రించాడ‌ని పేర్కొంటూ న్యాయం కోసం సీఎంను వేడుకున్నారు. దీంతో సీఎం త‌క్ష‌ణ‌మే స్పందించి స‌ద‌రు ఐఏఎస్‌ను తొల‌గించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: