కేసీఆర్ కేసు పెట్టాలంటున్నాడో ప్రతిపక్ష నేత.. ఎందుకో తెలుసా..? ఆయన ప్రజలను తప్పుదోవ పట్టించునందుకట.. కేసీఆర్‌ ఎప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించాడు.. అంటారా..? కరోనా వచ్చిన మొదట్లో కేసీఆర్.. పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటే కరోనా సోకదని అన్నాడు కదా.. అలాగే.. 20 డిగ్రీల వేడితో కరోనా క్రిములు జీవించలేవని కూడా కామెంట్ చేశాడు కదా.. అలా చెప్పడమే యావత్ తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ తప్పుదోవపట్టించడమట.  ఈమాటలు అంటున్నది ఎవరో కాదు... రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. 

 


అలాగే.. వేడి నీళ్లు తాగితే కరోనా రాదని మంత్రులు కూడా మభ్యపెడుతున్నారని బండి సంజయ్ కామెట్ చేస్తున్నారు. అందుకే.. కరోనాపై అసత్య ప్రకటనలు చేసిన కేసీఆర్ పైనా, ఆయన మంత్రులపై కేసులు  నమోదు చేయాలని సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యలకు, అణచివేతలకు సీఎం కేసీఆర్ పర్యాయపదంగా మారారని... కరోనాపై తప్పుడు వార్త ప్రచురించారంటూ బండి సంజయ్ ఆరోపించారు. 

 


అంతే కాదు.. ఖమ్మంకు చెందిన ఓ విలేకరిపై అక్రమ కేసులు బనాయించారంటూ బండి సంజయ్ అంటున్నారు. పత్రికా యాజమాన్యాలకు, విలేకరులకు కరోనా రావాలని ఆమధ్య   ఓ ప్రెస్ మీట్లో కేసీఆర్ శపించిన  విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేస్తున్నారు. ఇలాంటి కేసీఆర్ వైఖరిని ప్రజలంతా గమనించారని బండి సంజయ్ కోరారు. అనేక జిల్లాల్లో కరోనా విజృంభిస్తున్నా విస్తృతస్థాయిలో రాష్ట్రం మొత్తం కరోనా పరీక్షలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ మండిపడుతున్నారు. 

 


కేసీఆర్ సర్కారు వైఫల్యంపై పత్రికల్లో రోజూ కథనాలు వస్తున్నాయని.. అందుకే ఆ పత్రికలపైనా, పాత్రికేయులపైనా కేసీఆర్ కక్ష గట్టి అక్రమ కేసులతో వేధిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇంతకీ కేసీఆర్ పై కేసు నమోదు చేస్తారా.. చేసేంత సీన్ ఉందా.. హాహాహా.. ఈ ప్రశ్నకు సమాధానం తెలంగాణలో అందరికీ తెలుసు. 

మరింత సమాచారం తెలుసుకోండి: