చైనా దేశం పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. చైనా చేష్టలు ప్రపంచ దేశాలకు నచ్చడం లేదు. సామ్రాజ్యవాద కాంక్షతో చైనా భూభాగాలను ఆక్రమిస్తున్న తీరుపై చిన్న దేశాల నుంచి అగ్ర రాజ్యం వరకు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వేగంగా విజృంభిస్తోన్న చైనా వైరస్ లు ఆ దేశం పరువు తీస్తున్నాయి. కరోనా వైరస్ చైనాకు భారీ స్థాయిలో శత్రుదేశాలను తయారు చేసింది. 
 
ప్రస్తుతం చైనాను చిన్న దేశాలు సైతం లెక్క చేయడం లేదు. పలు దేశాలకు చైనా భారీ మొత్తంలో అప్పులు ఇచ్చింది. అయితే ఆ అప్పులను తాము కట్టే స్థితిలో లేమని... కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని... అయినా డబ్బు చెల్లించాలని కోరితే న్యాయపరంగా తేల్చుకుందామని హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుత చైనాకు చిన్నచిన్న దేశాల నుంచి పెద్దపెద్ద దేశాల వరకు అన్ని దేశాలతో తగువులు ఏర్పడ్డాయి. 
 
జపాన్ సముద్రతీరం దగ్గర చైనా నౌకలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో జపాన్ చైనాకు ధీటుగా బదులివ్వడానికి సిద్ధమవుతోంది. అయితే జపాన్ లాంటి పెద్ద దేశంతో పాటు ఫిలిప్పీన్స్ లాంటి చిన్న దేశం సైతం చైనాకు ఎదురు తిరుగుతోంది. అవసరమైతే యుద్ధానికైనా సిద్ధం అంటూ ఫిలిప్పీన్స్ కీలక ప్రకటన చేసింది. మయన్మార్ చైనా పద్ధతి మార్చుకోవాలని... ఉగ్ర శిబిరాలను తమ దేశంలో పెడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది. 
 
తాజాగా తైవాన్ కూడా చైనాతో యుద్ధానికైనా సిద్ధమని.... తమ జోలికి వస్తే ఊరుకోబోమని తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. భూటాన్ తమ భూభాగాలను చైనా ఆక్రమించడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని పేర్కొంది. వరుసగా చిన్న దేశాలు చైనాకు షాకులిస్తున్నాయి. చైనా తీరును ప్రతి దేశం తీవ్రంగా తప్పుబడుతోంది. చైనాకు మద్దతు ఇచ్చే దేశాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.                

మరింత సమాచారం తెలుసుకోండి: